మహేష్‌బాబు కెరీర్ ను పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లిన సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయాలంటే దానికి సంబంధించిన పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ ఉండాలి. అప్పుడే కథ వింటారు.. ఓకే చేస్తారు. అయితే ఒక సినిమా అతనికి ఈ పాఠం నేర్పింది. ఆ సినిమా చేయకముందు కథ చెప్పగానే ఓకే చెప్పి సినిమా పూర్తిచేసేవారు. కానీ ఎప్పుడైతే ఆ సినిమా చేశారో అప్పటి నుంచి పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ దగ్గరున్న తర్వాతే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రిన్స్ కు ఆ పాఠం నేర్పిన సినిమా ఏదంటే.. బ్రహ్మోత్సవం. మహేష్ బాబు కెరీర్లో భారీ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రిన్స్ ఫ్లాప్స్ లో మొదటి స్థానంలో నిలుస్తుంది.
కెరీర్ పై మాయని మచ్చలా పడింది
ఒకరకంగా ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ ను పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అసలు ఈ సినిమా ఎలా చేశాడు? అనేది మహేష్ బాబు అభిమానులకే కాకుండా పరిశ్రమలో ఉన్న నిర్మాతలు, దర్శకులందరికీ కూడా పెద్ద పజిల్ లా నిలిచింది. ఎందుకంటే కథ చెప్పి మహేష్ బాబు చేత ఓకే చేయించాలంటే సాధారణమై విషయం కాదు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సాహసం చేయాలి. అలాంటి బ్రహ్మోత్సవం లాంటి సినిమాతో తన కెరీర్ లో మాయని మచ్చలా పడిన ఈ సినిమా అంటే ప్రిన్స్ అభిమానులు కూడా దూరంగానే ఉంటారు.

రూ.5వేల కోట్లు రాబట్టే అవకాశం
ఆ తర్వాత నుంచే మహేష్ బాబు పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ దగ్గర ఉంటేనే కథ విని ఓకే చేస్తున్నారు. ఆ తర్వాత సినిమాలన్నీ ఘనవిజయాలు సాధించాయి. అలా తన కెరీర్ ను పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లినా ఒక పాఠమైతే నేర్పింది కాబట్టి అప్పటినుంచి ప్రిన్స్ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయాలనే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. రూ.5వేల కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications