రూ. 45 కోట్లతో తీస్తే రూ. 38 వేలు వచ్చింది.. స్టార్ హీరో ఉన్నా.. మామూలు దెబ్బ కాదు..!

ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి మూవీ తర్వాత పాన్ ఇండియా సినిమాల పరంపర ఊపందుకుంది. రూ. వందల కోట్లతో సినిమాలు నిర్మించడం ఆనవాయితీగా మారిపోయింది. సినిమా హిట్టా కాదా అని తెలిసేలోపే పెట్టిన డబ్బు వెనక్కు వచ్చేస్తోంది. అయితే సినిమా అన్నాక హిట్స్ ఉంటాయి. ప్లాఫ్స్ ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద కొన్ని ఊహకందని మ్యాజిక్ నంబర్లు క్రియేట్ చేసి వసూళ్లలో రికార్డులు సృష్టిస్తాయి. మరికొన్ని ఊహకందని ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతాయి.

అయితే బాలీవుడ్ కు చెందిన ఓ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ప్లాఫ్ గా మాట్లాడుకుంటున్నారు. అదే లేడీ కిల్లర్ మూవీ. రూ. 45 కోట్లతో ఈ మూవీ తీస్తే మొదటి రోజు కలెక్షన్స్ రూ. 38 వేలు మాత్రమే రావడం గమనార్హం. అనేక సార్లు షూటింగ్ లు, ప్రొడక్షన్ లేట్ కావడంతో ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోయింది. 2023 లో ఈ మూవీ విడుదలైంది. ఫస్ట్ డే కేవలం రూ. 38 వేలు మాత్రమే సాధించింది. ఇక ఫుల్ రన్ లో రూ. లక్ష కూడా రాబట్టలేక అల్ట్రా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఈ లేడీ కిల్లర్ మూవీలో భారీ తారాగణమే ఉంది. ఈ మూవీలో అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నవంబర్ 03, 2023 లో విడుదలైంది. ఈ మూవీని అజయ్ భాల్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో బీఏ పాస్, సెక్షన్ 375, బ్లర్ తదితర చిత్రాలను రూపొందించారు. అయితే ఈ మూవీ షూటింగ్ అనేక సార్లు వాయిదా పడడం కారణంగా మూవీ షూటింగ్ పూర్తికాకుండానే రిలీజ్ కావడం గమనార్హం.

The Lady Killer Bollywood s 45 Crore Flop Earns Just 38 000 on Opening Day

ఈ మూవీ దేశవ్యాప్తంగా 12 థియేటర్లలో మాత్రమే రిలీజైంది. ఈ మూవీ షూటింగ్ పూర్తికాకపోవడంతో చిత్ర యూనిట్ ప్రోమోషన్స్ లో కూడా హాజరు కాలేదు. ఇక రిలీజ్ రోజు కేవలం 293 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కేవలం రూ. 38 వేలు మాత్రమే వచ్చింది. దీంతో ఈ మూవీని ఇండియాలోనే డిజాస్టర్ మూవీగా చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+