యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న 'రాజా సాబ్'
బాహుబలితో ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రెబల్ స్టార్ ప్రభాస్... ఇప్పుడు తన అభిమానులు కోరుకునే పక్కా ఫన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. మాస్, లవ్, ఫ్యామిలీ అంశాలకు హారర్ కామెడీని జోడించి, సరికొత్త "రాజా సాబ్"గా మన ముందుకు వస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ డిజైన్ చేశాడు దర్శకుడు. ఇప్పటి వరకు ప్రభాస్ టచ్ చేయని జోనర్ కావడంతో "రాజా సాబ్" అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది.
ప్రేక్షకులను నవ్వుల్లో, భయాల్లో ముంచెత్తే రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌ను ఎంచుకుని, మారుతి మార్క్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ ప్రయోగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యాక్షన్ సినిమాలతో అలసిపోయిన డార్లింగ్ ఫ్యాన్స్‌కు, పాత రోజుల్లోని ప్రభాస్ 'చార్మ్'ను గుర్తుచేసేలా, ఈ 'ది రాజా సాబ్' ఒక స్పెషల్ ట్రీట్‌గా మారడం ఖాయం.

లంగీ కట్టులో, మెడలో రుద్రాక్ష ధరించి, ఆ పాత రాజభవనం నేపథ్యంలో ప్రభాస్ రాజసం చూపిస్తున్న తీరు, 'ది రాజా సాబ్' ఒక మామూలు సినిమా కాదని, ఫ్యాంటసీ, వినోదం, థ్రిల్ మేళవింపు అని స్పష్టం చేస్తోంది. ట్రైలర్ విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌పు షేక్ చేస్తోంది ఈ సినిమా.ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి వినోదాన్ని పంచుతుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications