అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా

సాధారణంగా అమెరికాలో ఏ సినిమా అయినా 4 వారాలకు మించి ఆడదు. మహా అయితే నెలరోజులు ఆడతాయి. అయితే భారతదేశం నుంచి, అందులోను మన తెలుగు నుంచి వెళ్లిన సినిమా ఏడాది ఆడిందంటే అది ఎంత సంచలనమో అర్థం చేసుకోవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన 'RRR' జపాన్ లో 500 రోజులు ఆడిన సంగతి తెలిసిందే. అలాగే అమెరికాలో కూడా ఏడాదిపాటు వార్తల్లో నిలవడమే కాదు.. సంవత్సరంపాటు ప్రయాణం చేసింది.

ఈ సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికల్లో అందుబాటులోకి వచ్చింది. అయినా అమెరికా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను వెండితెరపైనే చూడాలని కోరుకున్నారు. దీంతో ఈ సినిమాను అమెరికాలో కొన్న డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాల్లో ఆర్ఆర్ఆర్ 'హౌస్ ఫుల్' బోర్డులతో దర్శనమిచ్చి హాలీవుడ్ నిర్మాత, దర్శకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం కూడా బాగా కలిసివచ్చింది. విదేశీ మీడియాలో విపరీతమైన ప్రచారం లభించింది. ఏడాది కాలం అడపాదడపా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. వారికి పోటీగా మన తెలుగువారు కూడా పదే పదే థియేటర్లకు వెళ్లేవారు. అది కూడా కలెక్షన్లు పెరగడానికి బాగా కలిసివచ్చింది.

The RRR Phenomenon From Regional Blockbuster to Oscar Glory The Year That Defined Indian Cinema in America

లాస్ ఏంజిల్స్‌లో బాగా పేరు పొందిన టీసీఎల్ థియేటర్లో జరిగిన ప్రదర్శనలో, కేవలం 98 సెకన్లలోనే టిక్కెట్లు అమ్ముడవడం ఒక సంచలనం. 900 సీట్లు ఉన్న ఈ థియేటర్లో విదేశీయులు ఈలలు వేస్తూ సినిమాను ఎంజాయ్ చేశారు.

జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి దిగ్గజ దర్శకులు ఈ సినిమాను ప్రశంసించడంతో అమెరికన్లంతా ఆర్ఆర్ఆర్ ను చూసేందుకు ఎగబడ్డారు. వరుసగా గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు గెలుచుకోవడంతో ఈ అవార్డులు అందుకున్న ప్రతిసారీ థియేటర్ల సంఖ్య పెంచేవారు. అలా సంవత్సర కాలం సినిమా అమెరికాలో ఆడుతూనే వచ్చింది. అమెరికన్లు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఒకటి నుంచి 4 సార్లు థియేటర్లకు వెళ్లి చూశారని సర్వేలు చెప్పాయి.

జపాన్ లో ఈ సినిమా ఆడే సమయంలో అక్కడి ప్రేక్షకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ధరించిన దుస్తులను వేసుకొని మరీ వెళ్లేవారంటే అక్కడ ఎంత క్రేజ్ లభించిందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత అమెరికాలో మళ్లీ అంత క్రేజ్ వచ్చింది. ఇటీవలి కాలంలో ఏ సినిమా కూడా ఇటువంటి అరుదైన రికార్డులను సృష్టించలేదని చెప్పొచ్చు. దీన్ని టీమ్ మొత్తం సాధించిన విజయం రాజమౌళి అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+