సినిమా డైరెక్టర్ రెడ్డి మీద కేసు పెట్టిన భార్య, లవ్ మ్యారేజ్ చేసుకుని ఏం చేస్తున్నాడంటే?
పలు సినిమాలకు దర్శకత్వం వహించిన యువకుడు అతని ట్యాలెంట్ నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఇదే సమయంలో యంగ్ డైరెక్టర్ కు పరిచయం అయిన యువతి అతని ప్రేమలో పడింది. సినిమా దర్శకుడిని పెళ్లి చేసుకుంటే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అనుకున్న ప్రియురాలు ఆమె కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి చేసి ఆ సినిమా డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. తరువాత ఆమె జీవితంలో అసలు సిసలైన సినిమా మొదలైయ్యింది.
స్యాండిల్ వుడ్ సినీ దర్శకుడు మంజునాథ్ అలియాస్ సోమశేఖర్ రెడ్డి అలియాస్ మన్సారే అతని భార్యను అదనపు వరకట్నం కోసం వేధించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భర్త మంజునాథ్ రెడ్డిపై అతనిభార్య అఖిల బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మంజునాథ్, అఖిల చాలా సంవత్సరాల క్రితం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మంచితనంతో ఉన్న మంజునాథ్ రెడ్డిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని అఖిల అనుకుంది.

2021లో ఇరు కుటుంబాలను ఒప్పించిన మంజునాథ్, అఖిల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం సందర్భంగా మంజునాథ్‌కు సుమారు 1.5 కిలోల వెండి, బంగారు ఆభరణాలు సినీ దర్శకుడు మంజునాథ్ రెడ్డికి అఖిల కుటుంబ సభ్యులు ఇచ్చారని తెలిసింది. నూతన వధూవరులు చాలా కాలం సంతోషంగా ఉన్నారని తెలిసింది.
ఇటీవల మంజునాథ్ రెడ్డి, అఖిల దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ మంజునాథ్ రెడ్డి సోదరి హేమలత ఆమె ఆడపడుచు అఖిలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నదని సినీ దర్శకుడి భార్య అఖిల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది. భర్త మంజునాథ్ రెడ్డి, అతని సోదరి హేమలత, అత్తగారు వెంకటలక్షమ్మపై అఖిల ఫిర్యాదు చేసింది.
రూ. 30 లక్షలు వెచ్చించి మంజునాథ్ రెడ్డితో తాను గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నట్లు అఖిల ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పలు సినిమాలకు దర్శకత్వం వహించేందుకు ఖర్చులకు గాను తన భర్త మంజునాథ్‌కు రూ. 10 లక్షలు కూడా ఇచ్చామని అఖిల బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ 2.20 లక్షల విలువైన జావా బైక్, రూ.1.10 లక్షల విలువైన మొబైల్ ఫోన్, రూ. 76 వేల విలువైన ఐఫోన్ తమ కుటుంబ సభ్యులు తన భర్త మంజునాథ్ రెడ్డికి ఇచ్చారని బాధితురాలు అఖిల ఆరోపిస్తున్నది.

ఇంత డబ్బులు ఇచ్చినా ఇప్పుడు అదనంగా రూ. 30 లక్షల విలువైన కారు కొని ఇవ్వాలని చిత్రహింసలకు గురిచేస్తున్నారని అఖిల ఫిర్యాదులో పేర్కొంది. మంజునాథ్ అలియాస్ సోమకేశవ రెడ్డి (మన్సూర్)పై అతని భార్య అఖిల ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని,మంజునాథ్ సోమకేశవ రెడ్డి (మన్సూర్) అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారని పోలీసులు అన్నారు.
స్యాండిల్ వుడ్ లో మంయి గుర్తింపు తెచ్చుకున్న నాతిచరామి, 19.20.21 హరివు సినిమాలతో సహా పలు చిత్రాలకు మంజునాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. మొత్తం మీద స్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు ఇప్పుడు వరకట్నం వేధింపుల కేసులో చిక్కుకోవడం స్యాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు పదేపదే వివాదాల్లో చిక్కుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications