విజయ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సంక్రాంతి బరిలోకి దళపతి మూవీ..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి మూవీ 'జన నాయగన్'.. సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కావాల్సి ఉంది. అయితే కోర్టు ఉత్తర్వుల కారణంగా ఈ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. మూవీని వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. దాంతో దళపతి ఫ్యాన్స్ నిరాశలోకి వెళ్లారు. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ 'జన నాయగన్' మూవీ వాయిదా పడిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా దళపతి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది.
సంక్రాంతి కానుకగా జనవరి 15 న విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'తేరి' మూవీ రీ- రిలీజ్ కు కానుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ప్రకటించారు. 2016 లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని తెలుగులో పోలీసోడు అనే టైటిల్ లో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ మూవీ రిలీజై పదేళ్లు అవుతున్న సందర్భంగా తేరి మూవీని మరోసారి థియేటర్లలో రీ- రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

జన నాయగన్ మిస్ అయినా.. తేరి సినిమాలో పొంగల్ పండగ చేసుకునేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక తేరి మూవీలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications