థియేటర్‌లో 5 రోజులు మాత్రమే ఆడిన ఏకైక తెలుగు స్టార్ హీరో సినిమా
థియేటర్లలో సినిమాలు ఆడటం అనేది చాలా అరుదైపోయింది. గతంలో సినిమాలంటే వందల రోజుల తరబడి ఆడేవి. దీనివల్ల థియేటర్లలో పనిచేసే సిబ్బందితోపాటు క్యాంటిన్ నిర్వాహకులు, సైకిల్ స్టాండ్, స్కూటర్ స్టాండ్ నిర్వాహకులు.. ఇలా అందరికీ ఆదాయం బాగుండేది. కానీ మన హీరోలంతా రెండు సంవత్సరాలకోసారి, మూడు సంవత్సరాలకోసారి సినిమా చేస్తున్నారు. ఆ మూడు సంవత్సరాలకు సరిపడా పారితోషికం తీసుకుంటూ వారంతా బాగానే ఉంటున్నారుకానీ థియేటర్లన్నీ బోసిపోవడంతో.. కాలక్రమేణా చాలావరకు కల్యాణ మండపాలుగా, వాణిజ్య సముదాయాలుగా మారిపోయాయి.
ఐదో రోజు సున్నా వచ్చింది
ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలు కూడా కేవలం టికెట్ ధరలు పెంచుకొని రెండువారాలకు దుకాణం సర్దేసుకుంటున్నాయి. నిర్మాతలకు సినిమా ఆడితే వాళ్ల డబ్బులు వాళ్లకు వచ్చేస్తున్నాయి. కానీ నష్టపోతోంది మాత్రం థియేటర్ యాజమాన్యమే. నిలువెల్లా స్వార్థం నింపుకున్న తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా వీళ్ల గురించి మాత్రం ఆలోచించారు. మన తెలుగులో గతంలో ఎన్నో సినిమాలు థియేటర్లలో ఆడేవని చెప్పుకున్నాంకదా. అయితే అతి తక్కువగా థియేటర్లలో కేవలం ఐదు రోజులు మాత్రమే ఆడిన ఓ సినిమా అరుదైన రికార్డును నెలకొల్పింది. అదేదో గతంలో జరిగిన విషయం కూడా కాదు.. ఇటీవలే జరిగింది.

ఏ స్థాయి ఫ్లాప్ అనేది అర్థం చేసుకోండి
మెగా కాంపౌండ్ కు చెందిన హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా కేవలం ఐదురోజులు ఆడింది. ఐదోరోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదంటే ఇది ఏ స్థాయి ఫ్లాప్ సినిమానో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. 2024 నవంబరు 14వ తేదీన విడుదలైంది. నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, సలోని తదితరులు నటించారు. తీగల విజయేందర్ రెడ్డి, తాళ్లూరి రజని ఈ సినిమాను నిర్మించారు.












Click it and Unblock the Notifications