బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. ముంబైలో టెన్షన్.. టెన్షన్..
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిగాయి. ముంబైలోని జుహు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అతనిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో టైగర్ ష్రాఫ్ తో డ్రైవర్ తోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జుహు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుష్ప పార్క్ వద్ద జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ కాల్పుల్లో టైగర్ ష్రాఫ్ కు ఎలాంటి బుల్లెట్ గాయం తగలలేదని.. ఆయన సేఫ్ గానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అతను గ్రౌండ్ నుంచి తిరిగి వస్తుండగా బైక్స్ పై వచ్చిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మూడు నుంచి నాలుగు రౌండ్లు దుండగులు కాల్పులకు తెగబడినట్లు స్పష్టం చేశారు. అయితే అదృష్టవశాత్తు టైగర్ ష్రాఫ్ కు ఎలాంటి బుల్లెట్ గాయాలు తగలలేదని పేర్కొన్నారు.
ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరా తీశారు. ముంబై పోలీసుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై వేగవంతంగా దర్యాప్తు నిర్వహించాలని ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే టైగర్ ష్రాఫ్ పై కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ కాల్పులకు పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ కు చెందిన అనిల్ పండిట్, రహ్మాన్ సంధూ లు ఈ కాల్పులకు సూత్రధారులను తెలుస్తోంది. ఇక బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ చివరగా బాఘీ 4 లో నటించారు.












Click it and Unblock the Notifications
