ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(67) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు విడిచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం చనిపోయినట్లు పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాలో తాజాగా వెల్లడించారు. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్‌ బారిన పడ్డారని ఈ ఏడాదిలోనే పాయల్ చెప్పిన సంగతి తెలిసిందే.

తండ్రి మరణంపై ఆమె చాలా ఎమోషనల్ అయింది. "నాన్నా.. క్యాన్సర్ నుంచి మీరు కోలుకునేందుకు నేను చేయగలిగినదంతా చేశాను. కానీ విజయం సాధించలేకపోయా. క్షమించండి" అని పాయల్ రాజ్‌పుత్ భావోద్వేగానికి లోనయ్యారు. గుండె పగిలిన ఎమోజీని ఇన్‌స్టా పోస్టులో షేర్ చేస్తూ తన బాధను పంచుకున్నారు. ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ త్వరగా విషాదం నుంచి తేరుకోవాలని అభిమానులు సందేశాలు పెడుతున్నారు. హీరోయిన్ లక్ష్మీరాయ్, నిర్మాత ఎస్కేన్ వంటి వారు ఆమెకు సానుభూతి తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఇలాంటి బాధా సమయాల్లోనే మరింత బలంగా ఉండాలని కోరారు.

Tollywood Actress Payal Rajput s Father Passes Away After Battle with Cancer

కొన్ని నెలల క్రితం పాయల్ పోస్ట్
పాయల్ రాజ్‌పుత్ కొన్ని నెలల క్రితమే తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. ప్రస్తుతం కీమో థెరపీ జరుగుతోందని.. అందరి ఆశీస్సులు కావాలని, తన తండ్రి కోలుకోవాలని అందరూ ప్రార్థించమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆమె తండ్రి క్యాన్సర్ తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణించిన దుఃఖం నుంచి పాయల్ రాజ్‌పుత్ ఇంకా కోలుకోలేదు. పాయల్ రాజ్‌పుత్ చేసిన ఎమోషనల్ పోస్టును చూసి ఫ్యాన్స్ చలించిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+