ఆ పెళ్లి కోసమే దుబాయ్ కి క్యూ కడుతున్న టాలీవుడ్ సెలబ్రిటీలు...
తెలుగు సినిమా ప్రముఖులంతా దుబాయ్ కి పయనం అవుతున్నారు. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి వివాహ దినోత్సవం సందర్భంగా షేర్ చేసిన ఫోటోలతో మొదలు.. లేటస్ట్ గా మహేష్ బాబు భార్య నమ్రతా చేసిన పోస్టులను గమనిస్తే టాలీవుడ్ లోని పెద్ద సినీ కుటుంబాలైన మెగా, అక్కినేని, నందమూరి, ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా ఓ ప్రైవేట్ వెడ్డింగ్ లో సందడి చేస్తున్నారు.
దీంతో ఇంతకీ ఆ వెడ్డింగ్ ఎవరిది ? ఇంతమంది ప్రముఖులు వెళ్లడానికి కారణం ఏంటి ? ఇదే కాకుండా మరే కారణం ఏదైనా ఉందా అని కూడా తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు.. కుటుంబ సభ్యులతో కలిసి ఓకే చోట ఉండడం పట్ల కూడా అభిమానులు హ్యాప్పీగా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రముఖ నిర్మాత, ఏఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ మహేష్ రెడ్డి కొడుకు వివాహం కోసమే ప్రముఖులు అంతా వెళ్లినట్లుగా తెలుస్తోంది.

మహేష్ రెడ్డి గతంలో నాగార్జునతో షిర్డీ సాయి, ఓం నమో వెంకటేశాయ వంటి సినిమాలను నిర్మించారు. నాగార్జునతో పాటుగా తెలుగు ఇండస్ట్రీలోని స్టార్స్ అందరి తోనూ ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెబుతున్నారు. అందుకే అందరూ దుబాయ్ లో గ్రాండ్ గా జరుగుతున్న ఆయన కుమారుడి పెళ్లి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు పెళ్ళికి వెళ్ళిన వారి లిస్టులో ఫస్ట్ రామ్ చరణ్, ఉపాసన ఉండగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు.. అక్కినేని నాగార్జున - అమల దంపతులు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఉన్నారు. ఇక చివరగా ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతితో కలిసి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వారు షేర్ చేస్తుండడంతో వైరల్ గా మారుతున్నాయి.
ఇన్ స్టా వేదికగా నమ్రతా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టులో కీర్తి, నితేష్ కలిసి తమ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జీవితాంతం వాళ్లిద్దరూ ప్రేమగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. ఈ ఫొటోలలో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతీ, ఉపాసన, అమల తదితరులు ఉన్నారు.
అలానే వీడియోలో అనిరుధ్ 'గ్యాంగ్ లీడర్' సినిమా పాట పాడి ఉత్సాహ పరిచారు. సితార ఘట్టమనేని, డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి కలిసి అనిరుధ్ తో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా వీరంతా దుబాయ్ వేదికగా జరగనున్న ఇండియా Vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications