మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఉగాది పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తోంది.

అలానే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం చిరు 90 రోజుల కాల్ షీట్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. వరుస హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి మెగాస్టార్ తో సినిమా కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ అందుకున్న అనిల్.. చిరు సినిమాతో ఆ రికార్డులని బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

tollywoods-young-hero-as-villain-in-megastar-chiranjeevis-movie

ఈ చిత్రంలో మెగాస్టార్ తో వింటేజ్ కామెడీ పండించడంతో పాటు యాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉండేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందులో భాగంగానే మెగాస్టార్ పాత్రకు ధీటుగా విలన్ పాత్ర ఉండబోతుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ మేరకు ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. కార్తీకేయ చిరంజీవికి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. అవార్డ్ ఫంక్షన్ లోనూ ఆయన ఎంత భావోద్వేగానికి లోనయ్యారూ గుర్తు ఉండే ఉంటుంది. అలానే కార్తికేయ పెళ్లిలో సైతం చిరు సందడి చేశారు. దీంతోనే అనిల్ చెప్పిన స్కరీపట కూడా నచ్చడంతో కార్తికేయ సినిమాకు ఓకే చెప్పారని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు కార్తీకేయ. ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రలో సైతం అదరగొట్టాడు. తమిళంలో కూడా అజిత్ నటించిన తెగింపు సినిమాలో విలన్ పాత్ర పోషించారు. దాంతో ఇప్పుడు చిరు మూవీలోనూ కార్తికేయ నటించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

మరోవైపు మెగాస్టార్‌ ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+