టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ రెండో భార్య?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకులకన్నా బాలీవుడ్ ప్రేక్షకులే ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఈ ఏడాడి ఆగస్టు 15న విడుదల కాబోతోంది. పుష్ప మొదటి భాగంలో ఐటం సాంగ్ దేశాన్ని ఎంతలా ఊపేసిందో అందరూ చూశారు. ఊ అంటా మావా.. ఊహూ అంటావా మావా.. అంటు సాగిన ఆ పాట, అందులో నర్తించిన సమంత విపరీతంగా పాపులర్ అయ్యారు. సమంత వల్లే ఆ సాంగ్ కూడా అంత ప్రేక్షకాదరణ పొందిందని చెప్పొచ్చు.

తృప్తితో ఐటం సాంగ్
పుష్ప2లో అంతకు మించిన ఐటం సాంగ్ తీయాలని దర్శకుడు సుకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఎంతమందినో అనుకొని చివరకు దిశా పటానీ చేత స్పెషల్ సాంగ్ చేయించాలనుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో ఐటం సాంగ్ ను యానిమల్ గర్ల్ తృప్తి దిమ్రిచేత చేయించబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ సినిమాతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన తృప్తి ఐటం సాంగ్ చేస్తే కేక అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

Tripti Dimri doing an item song Pushpa 2 movie

వదినమ్మ సూపర్
ఈ పాటలో అల్లు అర్జున్ రెండో భార్యగా కనిపిస్తుందని, పూర్తి ఫోక్ సాంగ్ గా ఇది తెరకెక్కుతుందని చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతోంది. పుష్పగాడి మొదటి భార్య శ్రీవల్లి అయితే రెండో భార్య తృప్తి దిమ్రి అని, వదిన సూపర్ అని, కత్తి లాంటి వదినమ్మ అంటూ బన్నీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సుకుమార్ ఐటం సాంగ్ కు సూపర్ హీరోయిన్ ఎంపిక చేశారంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లో కూడా ఇదే చర్చనీయాంశమైన విషయంగా మారింది. సినిమా ఆగస్టు 15న విడుదలవుతుందా? లేదంటే మిగతా సినిమాల్లానే ఇది కూడా వాయిదా పడుతుందా? అనే అనుమానం అందరిలో రేకెత్తుతోంది. ఎందుకంటే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తవడంలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+