ఇష్టమైన వారు దూరమవుతారని తెలిసినా.. ఆ బాధ తప్పదు": త్రిష ఎమోషనల్ వీడియో!
దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందాల భామ నటి "త్రిష". తమిళ చిత్రసీమలో నిత్యం వార్తల్లో నిలిచే నటి త్రిష, ఇటీవల విజయ్‌తో సంబంధించిన వివాదాల కారణంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తన పెంపుడు జంతువులతో కూడిన మరో కోణాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
కాగా త్రిషకు కుక్కల పట్ల అమితమైన ప్రేమ ఉంటుందని తెలిసిందే. "కొడుకు"గా భావించి ఎన్నేళ్లుగానో పెంచుకున్న జోరో, 2024 చివరిలో మరణించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది. ఆ సమయంలోని సోషల్ మీడియా పోస్టులు ఆమె అనుబంధాన్ని స్పష్టం చేశాయి.

ఆ బాధ నుండి నెమ్మదిగా కోలుకున్న త్రిష, 2025 ఆరంభంలో ఇజ్జీ అనే శునకాన్ని దత్తత తీసుకుని, కూతురిలా పెంచుతోంది. ఇటీవల ఇజ్జీకి స్నానం చేయిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అందులోని వాత్సల్యం చాలా మందిని ఆకర్షించింది. "పెంపుడు జంతువులను పెంచడం కష్టమైనా, ఆనందం ఎంతో ఎక్కువ" అని పలువురు వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత త్రిష పంచుకున్న మరో వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. "కుక్కలు మనకంటే తక్కువగా జీవిస్తాయని తెలిసినా, జీవితంలోకి ఆహ్వానిస్తాం. అవి దూరం అయినప్పుడు మనసు ముక్కలవుతుందని తెలిసినా, ఆ బాధను మళ్లీ అనుభవించడానికి సిద్ధపడతాం." ఈ వ్యాఖ్యలు అభిమానులను ప్రభావితం చేశాయి. త్రిష ఇంకా జోరోను తలచుకుని బాధపడుతోందని దీని ద్వారా స్పష్టమైంది.
ఇక తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
అయితే థగ్ లైఫ్, ఐడెంటిటీ, విదాయమర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో కరుప్పు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాల్లో నటిస్తుంది. అలానే విజయ్ సేతుపతితో 96 సీక్వెల్ లో నటించనుంది.












Click it and Unblock the Notifications