Trivikram : త్రివిక్రమ్‌కు ఆ పిచ్చి ఉందా..?
మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది.
కథలో కొత్తదనం లేదని మహేష్ అభిమానులే సినిమాపై విమర్శలు చేశారు. త్రివిక్రమ్ మార్క్ లేకపోవడంతో పాటు, ఆయన గత సినిమాలను గుర్తు చేయడంతో బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం ఎబో యావరేజ్‌గా నిలిచింది. సరైన కథ లేకపోవడం వల్లే బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం మిక్సడ్ టాక్ వచ్చిందని అభిమానులు ఆరోపించారు. ఈ విషయంలో త్రివిక్రమ్‌నే అందరూ తప్పుపడుతున్నారు.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌కు క్యాస్ట్ ఫీలింగ్ ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఎప్పుటి నుంచో వినిపిస్తోంది. తాజాగా ఇది మరోసారి తెర మీదకు వచ్చింది. బ్రాహ్మణ కులానికి చెందిన త్రివిక్రమ్ ఆ సామాజిక చెందిన వారినే ఎక్కువుగా తన సినిమాల్లో తీసుకుంటారనే విమర్శ ఆయనపై ఉంది. దీనిలో భాగంగానే తనికెళ్ళ భరణి, హస్య నటుడు రాజబాబు తమ్ముడు అయిన అనంత్, గుండు సుదర్శన్ లాంటి నటులు ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాల్లో కనిపిస్తారు.
వీళ్లతో పాటు సీతారామశాస్త్రి, రామ జోగయ్య శాస్త్రిలను మాత్రమే తన సినిమాల్లో పాటల రచయితగా అవకాశాలు ఇస్తుంటారాయన. ప్రముఖ యాంకర్ ప్రదీప్, హీరోయిన్ ప్రణీత సుభాష్‌కు తన సినిమాల్లో ఛాన్సులు ఇచ్చి తన కుల పిచ్చిని చాటుకున్నారనే అపవాద త్రివిక్రమ్‌పై ఉంది. ఇక హీరోయిన్ పూజా హెగ్దె బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కావడంతోనే వరుస సినిమాల్లో అవకాశాలిచ్చి ఆమెను స్టార్ హీరోయిన్ చేశారనే విమర్శలు త్రివిక్రమ్‌పై ఉంది.
మరి కొంత మంది మాత్రం వారందరూ త్రివిక్రమ్‌కి మంచి ఫ్రెండ్స్ కావడం వల్లే వాళ్ళని తన సినిమాల్లో తీసుకుంటున్నారని అంతకు మించి ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ త్రివిక్రమ్‌పై ఇలాంటి రూమర్ రావడం నిజంగా శోచనీయం.












Click it and Unblock the Notifications