బాలయ్య పక్కన ఆ ఇద్దరు హీరోయిన్లు?

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాదిలో రెండు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి వీరసింహారెడ్డి, విజయ దశమికి భగవంత్ కేసరి విడుదలై రెండూ సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయికానీ సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ధ్రువీకరణ మాత్రం రాలేదు. ఈ సినిమాలో బాలయ్య పక్కన నటించేందుకు హీరోయిన్లను ఎంపిక చేశారని తెలుస్తోంది.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య పక్కన త్రిష నటించబోతోందంటూ వార్తలు వచ్చాయికానీ వాటిల్లో నిజం లేదని, ఈ చిత్రంలో ప్రియమణి నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ-ప్రియమణి జోడీగా మిత్రుడు సినిమాలో నటించారు. అది అంచనాలను అందుకోలేకపోయింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ వపర్ ఫుల్ గా ఉంటుందని, ఆ పాత్రకు ప్రియమణి సరిపోతుందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నటించింది.

two heroines tamannaah and priyamani paired with nandamuri balakrishna

ఈ సినిమాలోనే మరో హీరోయిన్ గా తమన్నా నటించబోతోంది. తమన్నా గతంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి సినిమా చేసింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తోపాటు ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయం నేపథ్యంగా ఉండేలా బాబీ కథ రాసుకున్నట్లు సమాచారం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఎదురవుతోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్, తమన్నా, ప్రియమణి రూపంలో వారికి ఆ కష్టాలు తొలగిపోతున్నాయి. ఎన్బీకే-109 గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+