బాలకృష్ణ, చిరంజీవి ఒకే వేదికపై.. రచ్చ ఇక అన్‌స్టాపబుల్!

బాలకృష్ణ హోస్ట్ గా సూపర్ టాక్ సొంతం చేసుకున్న టాక్ షో అన్ స్టాపబుల్ . ఓటిటి ప్లాట్ఫామ్ ఆహాలో మొదటి రెండు సీజన్ లు స్ట్రీమింగ్ అయిన బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్ అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు నాలుగో సీజన్ అన్ స్టాపబుల్ కోసం రంగం సిద్ధమైంది.

ఒకే వేదికపైకి బాలయ్య, చిరంజీవి
ఈ సీజన్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ నాలుగో సీజన్ కోసం ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈసారి ఈ సీజన్లో చిరంజీవి, బాలయ్య ఒకే వేదికపైన కనిపించడం స్పెషల్ కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22వ తేదీన దీనిపైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Unstoppable with NBK balakrishna host chiranjeevi as first guest aha surprising plan

చిరంజీవితో పాటు గెస్ట్ లు గా వాళ్ళు
ఇక బాలయ్య టాక్ షోలో ఈసారి చిరంజీవితో పాటు నాగార్జున కూడా సందడి చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ సీజన్లో బాలయ్యతో కలిసి వెంకటేష్ కూడా కనిపించేలా టీం ఇప్పటికే వెంకటేష్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే వెంకటేష్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన అనుమతి కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

వెంకటేష్ తోనూ సంప్రదింపులు
వెంకటేష్ కూడా బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకప్పటి టాలీవుడ్ దిగ్గజహీరోలు అందరూ అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ లో సందడి చేసినట్టు అవుతుంది. ఇప్పటికే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే అన్ స్టాపబుల్ సీజన్స్ లో ఇప్పటికే బాలయ్యతో పవన్ కళ్యాణ్ ,విజయ్ దేవరకొండ , అల్లు అర్జున్ , ప్రభాస్ లాంటి స్టార్ హీరోలంతా సందడి చేశారు.

ఈ సీజన్ కోసం ఆహా ప్లాన్
ఇప్పుడు ఫోర్త్ సీజన్ లో ముఖ్యఅతిథిగా చిరంజీవి రాబోతున్నట్టు సమాచారం. బాలయ్య టాక్ షో ప్రారంభమైన నాటి నుంచి చాలామంది చిరంజీవి గెస్ట్ గా రావాలని చిరంజీవితో బాలయ్య ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నారు. థర్డ్ సీజన్లోనే చిరంజీవి వస్తాడని భావిస్తే, చిరంజీవి అప్పుడు నిరాశపరిచారు. ఫోర్త్ సీజన్లో చిరంజీవితో సహా దిగ్గజ ఆర్టిస్టులతో బాలయ్య టాక్ షోను సూపర్ సక్సెస్ చేయాలని ఆహా ప్లాన్ చేస్తోంది.

ఆహా అధికారిక ప్రకటన ఎప్పుడో
అయితే దీనిపైన ఆహా ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కొత్త సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? బాలయ్య టాక్ షోలో అతిథులుగా వచ్చేవారు ఎవరు? అనేది తెలియాలంటే ఆహా నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+