అన్‌స్టాపబుల్ షోలో అల్లు ప్రస్తావన తెచ్చిన రామ్ చరణ్
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ షో , నాలుగో సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది.ఆహా ఓటీటీలో మొదటి మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ ఏ ముహూర్తానా అన్‌స్టాపబుల్ మొదలుపెట్టారో కానీ, ఆయనకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.
స్టార్ హీరోలకు సాధ్యం కాని విధంగా ఈ షోను ముందుకు నడిపిస్తున్నారాయన. ఇంకా చెప్పాలంటే ఆయన్ను వ్యతిరేకించే వారు కూడా ఈ షో చూసిన తర్వాత బాలయ్యపై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇక నాలుగో సీజన్‌లో ,ఏపీ సీఎం చంద్రబాబు, అల్లు అర్జున్, దుల్కార్ సల్మాన్, సూర్య వంటి స్టార్స్ సందడి చేశారు. హీరో నవీన్ పోలిశెట్టితో పాటు, హీరోయిన్ శ్రీలీల, వెంకటేష్, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వంటి సెలబ్రిటీలు ఈ సీజన్‌లో గెస్టులుగా రావడం జరిగింది.

తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం షోలో సందడి చేశారు. తాజాగా రామ్ చరణ్‌కు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. తన తల్లి, నానమ్మతో చరణ్.. వీడియో కాల్‌లో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు మాకు 2025లో ఒక మనవడు కావాలని అడుగడం ప్రోమోలో చూపించారు. అలాగే కూతుర్ని ఎప్పుడు చూపిస్తావని, రామ్ చరణ్‌ను బాలయ్య ప్రశ్నించారు. ఉపాసన అంటే భయమే కదా అంటూ బాలకృష్ణ రామ్ చరణ్‌ను చిలిపిగా ఆట పట్టించారు.అంతేకాకుండా చరణ్ ప్రభాస్‌కి కాల్ చేసి మాట్లాడారు.
ఇదే సమయంలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ఈ ముగ్గురిలో ఎవరితో పార్టీకి వెళ్తావని రామ్ చరణ్‌ను బాలకృష్ణ ప్రశ్నించగా, ఈ ముగ్గురితో వెళ్లనని, మామ అల్లు అరవింద్‌తో మాత్రమే వెళ్తానని రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు.ఈ ఎపిసోడ్‌కి చరణ్‌తో పాటు హీరో శర్వానంద్, దిల్‌రాజు, నిర్మాత విక్రమ్ కూడా వచ్చారు. ప్రస్తుతం ఈ ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications