ఒకే వేదికపై మెగాస్టార్, బాలయ్య?
ఆహా వేదికగా ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' త్వరలో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈ కొత్త సీజన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ షో మొదటి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే తెలుగు ప్రేక్షకులకు ఇది కన్నుల పండువలా మారడం ఖాయం.
టాలీవుడ్ ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చిన సరదాగా ముచ్చటించుకోవడం టాలీవుడ్లోనే అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మక సన్నివేశంగా మారనుంది. గత కొన్ని దశాబ్ధాలుగా తెలుగు చిత్రసీమను ఏలుతున్న ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు తమ సినిమాల ప్రమోషన్లతో సంబంధం లేకుండా ఇలాంటి ఓ ప్రత్యేక టాక్ షోలో ముఖాముఖి పాల్గొంటే.. ఈ ఎపిసోడ్ ఈ సీజన్‌కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

అయితే ఈ వార్తలతో పాటు మరో కొత్త కోణం కూడా చర్చకు వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్' కోసం ఓ టాక్ షో చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఆయన సొంతంగా ఓటీటీ ప్రాజెక్టులో భాగమైతే.. ఆహా వేదికగా బాలకృష్ణ నిర్వహించే 'అన్‌స్టాపబుల్' షోకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ ఇవి రెండూ వేర్వేరు ప్రాజెక్టులు కావడం, ఇద్దరి మధ్య ఉన్న మంచి సాన్నిహిత్యం దృష్ట్యా చిరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి మొదటి గెస్ట్‌గా రావడంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం ఇవి ప్రచారంలో ఉన్న ఊహాగానాలు మాత్రమే అయినప్పటికీ.. ఈ కాంబినేషన్ వినడానికే ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. బాలయ్య ఆహ్వానాన్ని అందుకొని మెగాస్టార్ అన్‌స్టాపబుల్ స్టేజ్‌పై అడుగుపెడతారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.













Click it and Unblock the Notifications
