సరిగ్గా 5 రోజులు ఆగితే ఈ 4 రాశుల వారి తలరాత మారుతోంది!
జ్యోతిష్య శాస్త్రంలో అదృష్టానికి, జ్ఞానానికి, ధన సమృద్ధికి ప్రతీకగా భావించే గురు గ్రహం (బృహస్పతి) త్వరలోనే తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. అక్టోబర్ 31న గురు దేవుడు కర్కాటక రాశి వీడి సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. వచ్చే జనవరి 25 వరకు ఆయన ఇదే రాశిలో కొనసాగుతారు. ఈ సుమారు మూడున్నర నెలల కాలంలో గురు భగవానుడి అపారమైన అనుగ్రహంతో నాలుగు రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభించడమే కాకుండా, పట్టిందల్లా మేలిమి బంగారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అదృష్ట రాశులేవో చూద్దాం.
సింహ రాశి
గురు గ్రహం స్వయంగా ఈ రాశిలోనే సంచరించనుండటంతో సింహ రాశి వారికి గురుబలం రెట్టింపు కానుంది. ఇన్నాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, ఆదాయ పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. ధైర్యంగా తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో బంపర్ లాభాలను తెచ్చిపెడతాయి.

ధనుస్సు రాశి
ఈ రాశి వారికి గురు సంచారం వృత్తిపరంగా సరికొత్త వెలుగులను నింపబోతోంది. ఉద్యోగంలో అనుకోని పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న మంచి అవకాశాలు తలుపు తడతాయి. కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల కాస్త బిజీగా మారినప్పటికీ, దానికి తగ్గ గుర్తింపు దక్కుతుంది. వ్యాపారంలో సరికొత్త భాగస్వామ్యాలు, విస్తరణకు సానుకూల వాతావరణం ఏర్పడి ఆర్థిక స్థితి బలపడుతుంది.
మేష రాశి
మేష రాశి వారికి గురువు అనుగ్రహంతో శ్రమకు తగిన విశేష ఫలితాలు లభిస్తాయి. ఆఫీసుల్లో ఉన్నతాధికారుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించి పనులు వేగవంతమవుతాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుని ఆశ్చర్యపరిచే స్థాయిలో లాభాలను చవిచూస్తారు. పాత బాకీలు వసూలై ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.
తులా రాశి
తులా రాశి వారు కోరుకున్న కోరికలు నెరవేరే సువర్ణ సమయమిది. కెరీర్ పరంగా ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు. వ్యాపారంలో ఇన్నాళ్లూ ఎదురైన అడ్డంకులు, చిక్కులు తొలగిపోయి లాభాల బాట పడతారు. ఈ సమయంలో అనవసర వ్యయాలకు దూరంగా ఉంటూ, సరైన ప్రణాళికతో ఖర్చులు చేస్తే ఆర్థికంగా మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.














Click it and Unblock the Notifications
