నిముషానికి కోటి రూపాయలు వసూలు చేస్తోంది!
హీరోయిన్లకు స్టార్ డం వచ్చిందంటే సంపాదన అమాంతం పెరుగుతుంది. దక్షిణాదిలో నయనతార ఎక్కువ పారితోషికం తీసుకుంటోంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా నిముషానికి కోటిరూపాయలు తీసుకుంటోంది. ఆమె ఎవరంటే ఊర్వశి రౌతేలా. ఒక్కో స్టార్ హీరోయిన్ కు పాపులారిటీ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. ఊర్వతి మాత్రం అందరికంటే విభిన్నంగా ఉంటుంది. చేసేది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం హీరోయిన్ల రేంజ్ లో ఉంటుంది. బాలీవుడ్ లో అందరూ ఆమె కోసం ఎదురుచూస్తుంటారు.
గతేడాది సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఈజ్ ద పార్టీ అంటూ చిరంజీవితో ఆడిపాడింది ఊర్వశి రౌతేలా. ఆ సినిమాలోని పాటలో కనిపించేందుకు రెండు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు పరిశ్రమలో డిమాండ్ బాగా పెరిగింది. బాలీవుడ్ కన్నా టాలీవుడ్ లోనే తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది. దీని తర్వాత అఖిల్ సినిమా ఏజంట్, పవన్ కల్యాణ్ బ్రో, రామ్ పోతినేని స్కంద సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. ఒక్కో సినిమాలో ఒక్కో పాటలో కనిపించడానికి మూడు నిముషాలకు మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అంటే నిముషానికి కోటిరూపాయల లెక్క.

దక్షిణాది ఉన్న హీరోయిన్లు సినిమా మొత్తానికి కలిపి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ బ్యూటీ మాత్రం నిముషానికి కోటి తీసుకోవడం సంచలనంగా మారింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సనంరే, హేట్ స్టోరీ4, పాగల్ పంతి వంటి సినిమాల్లో బోల్డ్ గా నటించింది. హిందీ, తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. తమిళంలో ది లెజెండ్ మూవీలో, కన్నడంలో మిస్టర్, ఐరావత సినిమాలు చేసింది. తెలుగు పరిశ్రమలో మాత్రం అమ్మడుకు హీరోయిన్ గా అవకాశం రావడంలేదు. ఏం చేస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications