నాగార్జునకు రూ.60 కోట్ల బాకీ ఉన్న స్టార్ హీరో, అతని అన్నయ్య?
అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇటీవలే రాజమౌళిని అతిథిగా పిలిపించి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించారు. మనదేశంలో ఇదే మొదటిది కావడం విశేషం. చాలా సినిమాలు తమ షూటింగ్స్ ను అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకుంటాయి. అలా జరుపుకున్నందుకు కొంత నగదును స్టూడియోకు చెల్లించడం సహజంగా జరుగుతుండేది. ఈ కోవలోనే చిరంజీవి హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానరులో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.
బడ్జెట్ భారీగా పెరిగిపోవడమే కారణమా?
ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకు కారణం.. నాసిరకమైన గ్రాఫిక్స్ వాడటమే. అయితే సినిమాకు బడ్జెట్ పెట్టే విషయంలో యూవీ క్రియేషన్స్ ఆచితూచి వ్యవహరిస్తోంది. రూ.300 కోట్ల బడ్జెట్ అంటూ వార్తలు రావడం.. చిరంజీవికి అంత మార్కెట్ ఉందా? లేదా? అని ఆలోచించుకుకోకుండా సినిమాను ఒప్పుకోవడం యూవీ చేసిన తప్పు. ఎందుకంటే ఈ సంస్థ ప్రస్తుతం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉంది. మిర్చితో ప్రారంభించిన వారి సినీ ప్రయాణం రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, జిల్, భాగమతి, భలేభలే మొగాడివోయ్, టాక్సీవాలా లాంటి చిన్న చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు భారీ లాభాలను కళ్లచూసింది. ఎప్పుడైతే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ సినిమాలకు వెళ్లిందో అప్పటినుంచి నష్టాలను మూటకట్టుకుంటోంది. దీనికితోడు వినయవిధేయ రామ, ఆదిపురుష్ లాంటి సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఊహించనిరీతిలో నష్టపోయింది.

సంస్థ నిర్వహణ తీరుపై చిరు అసంతృప్తి?
చిరంజీవి విశ్వంభర సినిమాకు నాలుగు రూపాయలు ఖర్చుచేయాల్సినచోట కేవలం ఒక రూపాయితో సరిపెడుతున్నారని, సంస్థ పనితీరుపై చిరంజీవి కూడా అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ ను ప్రభాస్ అన్న ప్రభోద్, ఇతర మిత్రులు కలిసి నడుపుతున్నారు. విశ్వంభర షూటింగ్ ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దీనికి సంబంధించి రూ.60 కోట్లను నాగార్జునకు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ ఎప్పుడు కడతారో, ఆ అప్పు ఎప్పుడు తీరుస్తారో, విశ్వంభర అనుకున్న సమయానికి మేలో విడుదలవుతుందా? అనే ప్రశ్నలకు మాత్రం యూవీ క్రియేషన్స్ వారు చెబితేనే సమాధానం తెలుస్తుంది.












Click it and Unblock the Notifications