మళ్లీ ముద్దులతో రెచ్చిపోయిన తెలుగు అమ్మాయి.. మళ్లీ హిట్ పక్కా !

వైష్ణవి చైతన్య.. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వెబ్ సిరీస్ లతో పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటనకి, అందానికి అంతా ఫిదా అయ్యారు. సిరీస్ లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడం తో సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అల్లు అర్జున్, నాని, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వైష్ణవి చైతన్య నటించి మెప్పించింది. ఇక సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన 'బేబీ' సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ తెలుగు అమ్మాయి.

కాగా "బేబీ" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం "ఎపిక్". #90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆదిత్య హాసన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సిరీస్‌లో మెప్పించిన ఆదిత్య పాత్ర చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. పక్కా లోకల్ అబ్బాయి ఫారిన్ వెళితే పడే ఇబ్బందులను కామెడీగా చూపిస్తూనే.. ఎమోషనల్ లవ్ ట్రాక్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ రీసెంట్ గానే విడుదలైంది.

vaishnavi-chaitanya-and-anand-devarakonda-epic-movie-teaser-released-and-got-viral-on-media

టీజర్ ఎలా ఉందంటే..?

ఆదిత్య అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా ఆనంద్, కడలి అనే మోడరన్ గర్ల్ గా వైష్ణవీ చైతన్య పరిచయం అయ్యారు. ఆనంద్ ముద్దు పెట్టుకోడానికి దగ్గరకు వచ్చినప్పుడు, 'మీరు ఏమిట్లు?' అని వైష్ణవీ ప్రశ్నించడం.. ఆ తర్వాత 'ఐయామ్ జిమ్ క్రిస్టిన్' అని ఓ ఫారినర్ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటే.. 'ఐయామ్ ఆదిత్య హిందూ' అని ఆనంద్ చెప్పడం కామెడిగా ఉంటుంది. ఇక ఆనంద్ - వైష్ణవీ మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశాలు యూత్ ని ఆకట్టుకుంటాయి.

కాగా 'బేబీ' సినిమాతో హిట్ పెయిర్ గా మారిన ఆనంద్‌ దేవరకొండ - వైష్ణవీ.. ఈసారి సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఓవరాల్ గా 'ఎపిక్' టీజర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+