నాకు పిచ్చి అని వాళ్లకి తెలుసు: టాలీవుడ్ హీరోయిన్
విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా 'సరస్వతి' మార్చి 6న థియేటర్లకు రానుంది. దోశ డైరీస్ బ్యానర్‌పై వరలక్ష్మి శరత్‌కుమార్, పూజ శరత్‌కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా గురించి, తన పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ప్రతీ పాత్ర చాలా అర్ధవంతంగా ఉంటుందన్నారు. ప్రకాశ్‌రాజ్, ప్రియమణి తమ నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారని.. ప్రేక్షకులకు మంచి సందేశం ఇస్తూనే ఆద్యంతం అలరిస్తుందని వరలక్ష్మి శరత్‌కుమార్ పేర్కొన్నారు.
నాకు పిచ్చి అని వాళ్లకి తెలుసు
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన చిత్ర యూనిట్, డైరెక్షన్ టీం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన టీం సభ్యులతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె చాలా సరదాగా పంచుకున్నారు. వరలక్ష్మి తన డైరెక్షన్ టీం సభ్యులైన మీనా, భాస్కర్, నవీన్, భవాని, పవన్‌లను పేరుపేరునా ప్రస్తావిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన పని తీరు వల్ల వారిని తాను చాలా ఇబ్బంది పెట్టినట్లు ఆమె అంగీకరించారు.

తన స్వభావం గురించి మాట్లాడుతూ వరలక్ష్మి కొన్ని ఇంట్రెస్టింగ్ చేశారు. తనకు కొంచెం పిచ్చి అని తన టీం అందరికీ తెలుసని ఆమె నవ్వుతూ చెప్పారు. తనకున్న ఆ పిచ్చిని కూడా భరిస్తూ, తనతో కలిసి పని చేస్తున్నందుకు టీం సభ్యులను ఆమె అభినందించారు.ముఖ్యంగా తన టీంలో భాస్కర్ అనే వ్యక్తి ప్రతి తప్పు జరిగినప్పుడు నవ్వుతూనే ఆ విషయాన్ని తనకు వివరిస్తాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ట్రైలర్ లాంచ్ సమయంలో కూడా ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు అతను తనదైన శైలిలో నవ్వుతూ పరిస్థితిని హ్యాండిల్ చేస్తాడని పేర్కొన్నారు. మరోవైపు తన తల్లి రాధిక గురించి మాట్లాడుతూ.. 'సొంత మదర్ కాకపోయినా నన్ను అనుక్షణం గైడ్ చేస్తూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన రాధిక గారి గురించి ఎంత చెప్పినా తక్కువే' అని వరలక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు.
నాకు లైట్ పిచ్చి ఉంది...
— UttarandhraNow (@UttarandhraNow) March 2, 2026
దాన్ని బాగా హ్యాండిల్ చేసారు!!
- వరలక్ష్మి శరత్ కుమార్#Saraswathi #VaralaxmiSarathKumar pic.twitter.com/5ALXW9Ngid
ఇలాంటి కథలు చాలా అరుదు: శరత్ కుమార్
ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ.. 'సరస్వతి' లాంటి కథను కచ్చితంగా ఓకే చెప్పి తీరాలి. స్త్రీలను గౌరవించడం మన కర్తవ్యం. ఈ సినిమా ప్రేక్షకుల ప్రేమను పొందుతుంది' అని ఆయన చెప్పుకొచ్చారు. 'ఆడవారికి ధైర్యాన్నిచ్చే చిత్రం 'సరస్వతి'. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయని ఆయన వెల్లడించారు.
వరలక్ష్మి నటించడం ఆయనకు ఇష్టం లేదు: రాధిక
తన కూతురు వరలక్ష్మి నటించడం శరత్ కుమార్‌కు ముందు ఇష్టం లేదని రాధికా శరత్ కుమార్ వెల్లడించారు. వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్న సమయంలో శరత్ వ్యతిరేకించారని.. ఎలా నటిస్తావ్.. నువ్వు నటించొద్దు అంటూ సీరియస్ అయ్యేవారని రాధిక చెప్పుకొచ్చారు. మా కూతురిని నటిగా ఎంపిక చేయొద్దని నిర్మాతలకు ముందే చెప్పేవారు. ఈ విషయాలన్నింటిని తన తల్లితో కలిసి వరలక్ష్మి ఓ రోజు తనతో పంచుకుందని రాధిక తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకోలేనని చెప్పి.. సినిమా సెట్స్‌లో ఉన్న శరత్ వద్దకు వారిని తీసుకెళ్లానని.. అప్పుడు ఆయన.. నమితతో కలిసి ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్నారని వెల్లడించారు. మమ్మల్ని చూడగానే కారవాన్‌లోకి నవ్వుతూ వెళ్లిపోయారని.. తర్వాత వరలక్ష్మి నటించేందుకు అంగీకరించారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications