మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ?
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్ (VFX) వర్క్ చేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ తన వెబ్‌సైట్‌లో స్టోరీని క్లుప్తంగా రాయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
స్టోరీ ఇదే..
ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేశ్‌బాబు పరమ శివభక్తుడిగా కనిపిస్తారని సమాచారం. అపారమైన ఆధ్యాత్మిక శక్తులతో పాటు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న ఒక అరుదైన 'విశ్వ కళాఖండం' కోసం ఆయన చేసే అన్వేషణ కథకు ప్రధానాంశంగా నిలుస్తోంది. కనుమరుగైన ఆ విశ్వ కళాఖండాన్ని వెతికే క్రమంలో మహేశ్‌బాబు కాలగమనాన్ని దాటి ప్రయాణిస్తాడని అంటున్నారు. శతాబ్దాల నాటి నాగరికతలు, పురాతన దేవాలయాలు, గూఢరహస్యాలతో నిండిన ప్రదేశాల్లో ఈ సాహస యాత్ర సాగుతుందని భావిస్తున్నారు. మొత్తంగా తన ప్రయాణంలో ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, దాగి ఉన్న రహస్యాలను ఎలా ఛేదిస్తాడనేది మూవీ స్టోరీ.

ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న Prithviraj Sukumaran పాత్రకు 'కుంభ' అనే పేరు పెట్టినట్టు ఇప్పటికే వెల్లడించారు. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ఆశపడే అత్యంత తెలివైన, క్రూరమైన వ్యక్తిగా ఆయన కనిపించనున్నారు. ఆ విశ్వ కళాఖండాన్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని శాశ్వతంగా తన గుప్పిట్లో పెట్టుకోవాలనే అతని లక్ష్యమే కథలో ప్రధాన ఘర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, ముఖ్యంగా IMAX ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ సెట్స్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని సమాచారం.
షూటింగ్ - రిలీజ్ ప్లాన్..
ఇప్పటికే పృథ్వీరాజ్ తన భాగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. మిగతా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి చిత్రీకరణ ముగించాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి.












Click it and Unblock the Notifications