ఇదేందయ్యా ఇది.. వారణాసి షూటింగ్‌కి బ్రేక్.. "సమ్మర్ హాలిడేస్" !
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 7, 2027న శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, ముఖ్యంగా IMAX ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ సెట్స్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని సమాచారం. అందుకు తగ్గట్టు రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే 80 శాతం ఘాట్ పూర్తయిందని సమాచారం. అయితే ప్రస్తుతం చేస్తున్నది ఫినిష్ అయిన తర్వాత మే నెల మొత్తం షూటింగ్‌కు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఎండల తీవ్రత దృష్ట్యా నటీనటులు, టెక్నీషియన్స్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్‌కు విశ్రాంతినిచ్చినా కానీ ఈ గ్యాప్‌లో రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులపై దృష్టి సారించనున్నట్టు గుసగుసలు అందుతున్నాయి.
అయితే సాధారణంగా రాజమౌళి సినిమా విషయంలో చాలా కఠినంగా ఉంటారని అందరికీ తెలిసిందే. పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేకులైనా తీసుకునే ఆయన.. శిల్పాన్ని చెక్కినట్టే సినిమాను చెక్కుతారని 'జక్కన్న' అని పిలుచుకుంటారు. కానీ ఈ మూవీ కోసం రాజమౌళి తన పంథా మార్చుకొని సమ్మర్ బ్రేక్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయంపై అటు సినీ వర్గాలు, ఇటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications