'వారణాసి' రిలీజ్ డేట్ అదేనా..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారణాసి మూవీ రిలీజ్ డేట్ ఇదేనంటూ పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం 'వారణాసి'. ఈ మూవీ దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్ ​తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై తాజాగా ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. 2027 ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా వారణాసి మూవీని గ్రాండ్‌ గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు వారణాసి మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. పారిస్​ లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్ కమ్ ఆడిటోరియంలో ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా హాలీవుడ్ కు చెందిన భారీ మూవీస్ కు ఇక్కడ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇదే జరిగితే ఇండియాలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సినిమాగా వారణాసి నిలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Varanasi Release Date Rumor Goes Viral Mahesh Babu-Rajamouli Epic on April 9 2027

ఇక గతేడాది నవంబర్ 15న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్​ సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే టైటిల్​ రిలీజ్​ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. విజువల్స్‌ లో మైథాలజీ, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. టైటిల్ గ్లింప్స్ లో రాజమౌళి మార్క్ స్పష్టంగా కనిపించింది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి హింట్ ఇచ్చారు. కానీ రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+