ఓడినా ఎంబాప్పెనే హీరో- గోల్డెన్ బూట్ అతనికే: రాక్ స్టార్ కు గోల్డెన్ గ్లోవ్స్

ఫిఫా వరల్డ్ కప్ విజేతపై మెజారిటీ అంచనాలు, జోస్యాలు తలకిందులు అయ్యాయి. నిరుటి విజేత అర్జెంటీనా.. తన ఛాంపియన్ షిప్ ను నిలబెట్టుకుంటుందని ఆశించిన సగటు ఫుట్‌బాల్ అభిమానికి నిరాశే మిగిలింది. అర్జెంటీనా ఓడింది. స్పెయిన్ గేమ్ ప్లాన్ ముందు తలవంచింది. ఆ జట్టు డిఫెన్స్ ను ఛేదించలేకపోయింది. అటు స్పెయిన్ గోల్ కీపర్ అడ్డుగోడగా మారడం కూడా అర్జెంటీనా ఓటమికి ప్రధాన కారణం. పదే పదే దాడులు చేసినా అవేవీ కూడా ఫలించలేదు. 0-1 తేడాతో ఓటమిని తప్పించుకోలేకపోయింది.

న్యూజెర్సీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై స్పెయిన్ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్ కు దారితీసింది. ఆ సమయంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెరాన్ టోర్రెస్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు 1-0 తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.

FIFA World Cup Awards Mbappe Wins Golden Boot Rodri Takes Golden Ball Unai Simon Earns Golden Glove

ఈ టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అందించే అవార్డుల వివరాలు వెల్లడయ్యాయి. కప్‌ గెలవడమే కాకుండా వ్యక్తిగత అవార్డుల్లోనూ స్పెయిన్ ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా కనపర్చారు. ఇక్కడా స్వీప్ చేశారు. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్స్ వంటి అవార్డులు స్పెయిన్ పరం అయ్యాయి. మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాప్పె నిలిచాడు. అతనికి గోల్డెన్ బూట్ అవార్డ్ దక్కింది.

టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన ప్లేయర్‌కు ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డును స్పెయిన్ ప్లేయర్ రోడ్రి సొంతం చేసుకున్నాడు. టోర్నీ అంతటా స్పెయిన్ జట్టును ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించాడీ మిడ్ ఫీల్డర్. మ్యాచ్ గమనాన్ని శాసిస్తూ వచ్చాడు. జట్టును సమన్వయం చేయడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు రోడ్రికి ఈ పురస్కారం లభించింది.

స్పెయిన్ డిఫెన్స్ ను ఓ కంచు కోటగా మార్చిన గోల్‌కీపర్ ఉనై సిమోన్ గోల్డెన్ గ్లోవ్స్ అవార్డును అందుకున్నాడు. టోర్నీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో అతను ఒక్క గోల్ మాత్రమే ప్రత్యర్థులకు ఇచ్చుకున్నాడు. ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో క్లీన్ షీట్‌లతో అదరగొట్టాడు. అతనితో పాటు డిఫెన్స్‌లో అద్భుతమైన పరిణతి చూపించిన 19 ఏళ్ల పావు కుబార్సి.. యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు ఎంపికయ్యాడు.

ఫుట్ బాల్ ప్రపంచ అత్యుత్తమ స్ట్రైకర్లలో ఒకడైన ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాప్పె అత్యధిక గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్నాడు. టోర్నీలో మొత్తం 10 గోల్స్ కొట్టాడు. ఈ అవార్డును అందుకోవడం అతనికి ఇది వరుసగా రెండోసారి. గతంలో కూడా గోల్డెన్ బూట్ ను అందుకున్నాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సి ఎనిమిది గోల్స్‌తో ఎంబాప్పెకు గట్టి పోటీ ఇచ్చాడు గానీ.. ఫైనల్ లో నిరాశపరిచాడు. ఇది ఎంబాప్పెకు కలిసొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+