తాత అయిన పవన్ కళ్యాణ్.. ఎలాగో తెలుసా ?
మెగా ఫ్యామిలిలోకి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ - నటి లావణ్య దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. గర్భవతిగా ఉన్న లావణ్య ఈరోజు ( సెప్టెంబర్ 10, 2025 ) మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని.. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమా షూటింగ్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటలకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసినట్టు చెబుతున్నారు. కాగా విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఈ జంటకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచియమైంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ''మిస్టర్'', ''అంతరిక్షం'' సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది.

2023 నవంబర్ 1న ఇటలీలో వివాహం చేసుకున్నారు. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రీసెంట్ గానే జీవితంలోనే అత్యంత అందమైన పాత్రలోకి అడుగుపెట్టబోతున్నాం - త్వరలో రాబోతోంది" అంటూ చేతులు పట్టుకుని ఉన్న ఒక అందమైన ఫోటోను, రెండు చిన్న వైట్ బూట్ల ఫోటోను వారు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఇక ఈ సంతోషకరమైన వార్తతో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ఓ వైపు పవన్ పొలిటికల్ గా డిప్యూటీ సీఎం అవ్వడం.. వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తుండడం .. ఇటు చిరు, చరణ్ సహా హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలో ఈ గుడ్ న్యూస్ ఇంకాస్త మంచి విషయం అని చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ అంతా పవన్, చిరులు మళ్లీ తాతలు అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు వరుణ్ తేజ్ ఒక సినిమా చేస్తుండగా.. లావణ్య నటించిన మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. అటు నిహారిక సైతం నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉంది. నాగబాబు ఇటీవలే ఎమ్మెల్సీగా అవ్వగా.. త్వరలోనే మంత్రి కానున్నారు.












Click it and Unblock the Notifications