ఉపాసనపై బాంబు పేల్చిన వేణు స్వామి

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ఆయన చెప్పనవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువైంది. నాగ చైతన్య, సమంత , నిహారిక, ఇలా పలువరు సినీ తారలు వీడిపోతారని.. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోతుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు.

తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్య్వూలో పాల్గొన్న వేణు స్వామి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని చెప్పిన వేణు స్వామి పలువురు మంత్రులు ఓటమిపాలై అయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఇక మెగా కుటుంబంపై కూడా ఆయన తనదైనశైలిలో స్పందించారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పుట్టిన క్లిన్ క్లారా జాతకంపై వేణు స్వామి స్పందించారు. ఆమెది తిరుగులేని జాతకం అని అనేక విజయాలు సాధించి మంచి గుర్తింపు సంపాదించుకుంటుందని అన్నారు.

Venu Swamy prediction on ram charan wife upasana

సాధారణంగా పిల్లల జాతకాల గురించి చెప్పకూడదు. ఆమెది తిరుగులేని జాతకం అని అనేక విజయాలు సాధించి మంచి గుర్తింపు సంపాదించుకుంటుందని అన్నారు. కేవలం బాలారిష్టం ఉన్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదు. ఒకవేళ అలా చెబితే వారికి ఉండే గండాల గురించి కూడా చెప్పాలి. అందుకే చాలా మందికి జాతకాలు చెప్పరు. అన్ని బాగున్న పిల్లలకు చెప్పవచ్చు అని వేణు స్వామి తెలిపారు. అలాగే ఉపాసనకు ఇక పిల్లలు పుట్టరని చెప్పి గట్టి షాకిచ్చారు.

దీంతో వేణు స్వామిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో బిడ్డ విషయంలో ఉపాసన ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. సెకండ్ చైల్డ్‌ని కనడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉపాసన ప్రకంటించారు. నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తరువాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయలని అనుకోవడం లేదని ఉపాసన చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+