వేణు స్వామి సంచలనం..నాగ చైతన్య, శోభిత ధూళిపాళపై మరో బాంబు
ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.
వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు.

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఒకపక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినిప్పటికి కూడా సెలబ్రిటీలు ఆయన్ను మాత్రం వదలడం లేదు. ఇదిలా ఉంటే సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌గా రిలేషన్‌ను కొనసాగించారు. తాజాగా వీరిద్దరు తమ బంధాన్ని బహిర్గతం చేశారు. గురువారం శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. తాజాగా వీరిద్దరి పెళ్లిపై వేణు స్వామి స్పందించారు. శోభిత, నాగ చైతన్య వైవాహిక జీవితంపై సంచలనాత్మమైన, జాతకపరమైన విశ్లేషణ రేపు చేస్తానని వేణు స్వామి ప్రకటించారు. దీంతో అక్కినేని అభిమానుల్లో కొత్త అనుమానం మొదలైంది. గతంలో సమంత , నాగ చైతన్య విడిపోతారంటూ మొట్ట మొదటగా చెప్పింది వేణు స్వామినే. దీంతో ఇప్పుడు శోభిత, నాగ చైతన్యల జీవితం గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications