ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ మూవీని వదులుకున్న వెంకటేష్

తెలుగులో ఉన్న అగ్ర కథానాయకులు నలుగురిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. మిగతావారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున. వీరిలో సినిమాల పరంగా విజయాల శాతం వెంకీమామకే ఎక్కువ. తన సినిమా మినిమం గ్యారంటీతో రావడమే కాకుండా కుటుంబ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. పాన్ ఇండియా సినిమా కూడా కాదు. కేవలం హాస్యానికి పెద్దపీట వేస్తూ, కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకొని వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. భవిష్యత్తులో వీరిద్దరి కాంబోలో ఇంకా పలు సినిమాలు రానున్నట్లు అనిల్ వెల్లడించారు.

రాజకీయ నేపథ్యం ఉందని వద్దన్నారు
తన కెరీర్ లో బాగా బిజీగా ఉన్న సమయంలో వెంకటేష్ దగ్గరకు ఎన్నో కథలు వచ్చాయి. కాల్షీటు ఖాళీ లేకపోవడం, డేట్లు సర్దుబాటు చేయలేకపోవడం, కథలు నచ్చకపోవడంలాంటి కారణాలతో కొన్నింటిని వదులుకున్నారు. ఇలా వదులుకున్నవాటిలో ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒకే ఒక్కడు సినిమా కూడా ఉంది. దక్షిణాదిలో అగ్ర దర్శకుడి చెలామణి అవుతున్న శంకర్ ఆ సమయంలో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయనతో సినిమా కోసం స్టార్ హీరోలంతా ఎదురుచూసేవారు. ఒకేఒక్కడు సినిమా ముందుగా రజనీకాంత్ తో చేద్దామనుకున్నారు. కానీ రాజకీయ నేపథ్యం ఉన్న కథ కావడంతో రజనీ ఈ సినిమా చేయడానికి వెనకాడారు. తర్వాత మరో ఇద్దరు హీరోలను సంప్రదించినప్పటికీ వారు కూడా ఆసక్తి చూపలేదు.

victory venkatesh missed india s biggest blockbuster movie

రెహమాన్ అందించిన సంగీతం సూపర్
శంకర్ చివరకు దీన్ని వెంకటేష్ తో చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ వెంకీమామ బిజీగా ఉండటంతోపాటు కొన్ని ఇతర కారణాలవల్ల తిరస్కరించారు. చివరకు అర్జున్ తో తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించారు శంకర్. ఒకరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ అందరికీ నచ్చింది. ఇందులోని పాటలకు రెహమాన్ అందించిన ట్యూన్లు సూపర్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ అవి మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. అటువంటి సినిమాను వదులుకోవడం బ్యాడ్ లక్ అంటూ వెంకీమామ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న వెంకీ తర్వాత సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఫ్యామిలీ డ్రామా చేస్తారా? యాక్షన్ చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+