దేశవ్యాప్తంగా "అన్నదానం".. "విరోష్" జంట బిగ్ డిసిషన్..!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ బ్యూటీ రష్మిక మందన్న వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరి వివాహం ఈరోజు ( ఫిబ్రవరి 26, 2026 ) ఉదయం ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో నిర్వహించారు. ఈ పెళ్లికి సినీప్రముఖులు, సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. అంతే కాకుండా ఈ పెళ్లిలో నో ఫోన్ పాలసీని సైతం అమలు చేశారు. మరీ ముఖ్యంగా ఈ వివాహ వేడుక ఓ ప్రత్యేకతను చాటుకుంది. విజయ్ తెలుగు సంప్రదాయాలను, రష్మిక కూర్గ్‌లోని కొడవ వలస వారసత్వాన్ని కలిపి.. ఈ వివాహాన్ని రెండు విభిన్న సాంస్కృతిక గుర్తింపుల అందమైన సమ్మేళనంగా జరుపుకున్నట్టు తెలుస్తోంది.
ఈ కొత్త పెళ్లి జంట ఇటీవలే హైదరాబాద్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం రిసెప్షన్‌కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలకు విజయ్ దేవరకొండ, రష్మిక(విరోషి) జంట సర్‌ప్రైజ్ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అన్నదానం..
మార్చి 1(ఆదివారం) ఈ అన్నదానం, స్వీట్ల పంపిణీ చేశారు ఈ జంట. ఈ మేరకు ముందుగానే సోషల్ మీడియా ద్వారా తమ కృతజ్ఞతని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వీట్ల రూపంలో తమ ప్రేమని పంచుతున్నట్టు తెలిపారు. స్వీట్లు, అన్నదానం పంపిణి చేసే లొకేషన్లు, టెంపుల్స్ వివరాలు వెల్లడించారు. ఇందులో తాము వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించిన దేశ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బిహార్ లోని పలు నగరాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఇక ఆ పోస్టులో.. మా జీవిత ప్రయాణంలో ఈ దేశ ప్రజలందరూ ఒక భాగమే. మా వివాహం సందర్భంగా మీరంతా చూపించిన ప్రేమకు, అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు. ఈ సంతోషమైన సందర్భాన్ని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మీ అందరికీ స్వీట్స్ పంపిస్తున్నాము. వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలి అని రాసుకొచ్చారు.
— Vijay Deverakonda (@TheDeverakonda) February 28, 2026












Click it and Unblock the Notifications