అభిషేక్ పిక్చర్స్ ఎప్పటినుంచో మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది!
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కలెక్షన్స్ విషయంలో హీరో విజయ్ దేవరకొండపై నిర్మాణ సంస్థ, పంపిణీ దారు అయిన అభిషేక్ పిక్చర్స్ ఇటీవల ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అభిషేక్ కామెంట్స్ పై విజయ్ తండ్రి గోవర్ధన్ రావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడిపై ఇటువంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని, ఒక సినిమావల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే పరిహారం చెల్లించాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫ్లాపవడంతో విజయ్ తన పారితోషికంలో 50 శాతాన్ని తిరిగి నిర్మాత కె.ఎస్.రామారావుకు తిరిగిచ్చేశాడు. అలాగే ఆయన ఇస్తానన్న ఫ్లాట్ కూడా వద్దన్నాడు. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామాతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని తెలిపారు. సినిమా వసూళ్ల విషయంలో నిర్మాతతో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయని, అప్పటి నుంచి విజయ్ ను అభిషేక్ నామా టార్గెట్ చేసుకున్నాడని, చాలా రోజుల నుంచి తమను ఇబ్బంది పెడుతున్నాడని గోవర్ధన్ రావు వెల్లడించారు. నిజంగానే తాము డబ్బులు ఇవ్వాల్సి ఉంటే న్యాయస్థానాన్ని సంప్రదించాలని సూచించారు. అలా కాకుండా పబ్లిక్ గా తమపై ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని, బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. విజయ్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో అభిషేక్ తమను సంప్రదించాడని, అతని ప్రవర్తన చూసిన తర్వాత అతనితో కలిసి పనిచేయాలనుకోలేదని గోవర్ధనరావు వివరించారు.

ఖుషి రెమ్యునరేషన్ నుంచి కోటిరూపాయలు అభిమానులకిస్తానని విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పంపిణీలో రూ.8 కోట్లు నష్టపోయామని, దీనిపై ఎవరూ స్పందించలేదని, మీరు దయా హృదయంతో కోటిరూపాయలను పలు కుటుంబాలకు అందివ్వనున్నారు. అలాగే మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని కోరుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications