హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కెమిస్ట్రీ వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ అదిరిపోతోందని మరోసారి నిరూపితమైంది. గత నెల ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, ప్రస్తుతం తమ 'మధుర క్షణాలను' ఆస్వాదించే పనిలో పడ్డారు. హనీమూన్ ట్రిప్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లోని అందమైన కోహ్ సముయ్ దీవికి వెళ్లిన ఈ జంట, అక్కడి ప్రైవేట్ రిసార్ట్‌లో గడుపుతున్న ఏకాంత సమయానికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
పెళ్లి తర్వాత రష్మిక తన భర్త విజయ్‌తో కలిసి ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ తన మనసులోని మాటను బయటపెట్టారు. "వచ్చే ఐదేళ్లలో ప్రపంచాన్ని చుట్టి రావాలని ఉంది" అని రష్మిక తన కోరికను వెలిబుచ్చగా.. "కచ్చితంగా చేద్దాం, అందుకు నేను సిద్ధం" అంటూ విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

కోహ్ సముయ్ దీవి తమకు సొంత ఇల్లులా అనిపించిందని, నిశ్చలమైన ఉదయాలు, స్విమ్మింగ్ ఫూల్ స్నానాలు, టేబుల్ టెన్నిస్ ఆడుతూ గడిపే సాయంత్రాలతో ప్రతి క్షణం మరుపురాని జ్ఞాపకంగా మారిందని రష్మిక మురిసిపోతున్నారు.
'నా భర్త'.. క్యూట్ సంభాషణ!
ఈ పర్యటనలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- రష్మిక: "నిన్ను 'నా భర్త' అని పిలవడం ఇంక అలవాటు చేసుకోవాలి."
- విజయ్: "నువ్వు నా ప్రియమైన స్నేహితురాలివి.. ఆ స్థానం ఎప్పటికీ మారదు."
ఈ మాటలతో విజయ్ తనదైన స్టైల్లో రష్మికపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. తను డ్యాన్స్ చేయడానికి కష్టపడతానని, కానీ రష్మిక అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందని విజయ్ కొనియాడారు. రష్మిక తన జీవితంలోకి వచ్చాక ప్రతి రోజూ మరింత అందంగా మారుతోందని ఆయన చెప్పుకొచ్చారు.
సెప్టెంబర్‌లో వస్తున్న 'రణబాలి'
వివాహ వేడుకల హడావుడి ముగియగానే ఈ జంట మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రణబాలి' షూటింగ్ చివరి దశలో ఉంది. వెండితెరపై మళ్ళీ ఈ హిట్ జోడీని చూడాలని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. నిజ జీవితంలో పెళ్లయ్యాక వస్తున్న మొదటి సినిమా కావడంతో 'రణబాలి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications