SSMB29: ఇలాంటి సినిమా ఇండియాలో రాలేదు.. !

ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ SSMB29.ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రూ. 2000కోట్ల బొమ్మ అంటూ అటు ఘట్టమనేని ఫ్యాన్స్ తో మూవీ క్రిటిక్స్ లెక్కలేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కాబట్టి జక్కన్న ఏ రేంజ్ లో తీస్తారో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె హీరోయిన్ పాత్ర చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ దీనిపై మూవీ టీమ్ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందన్న వార్తలు ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించిన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే భారీస్థాయిలో ఈ సినిమా స్టోరీని సిద్ధం చేసినట్లు ఆయన పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. దీంతో మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Vijayendra Prasad Hints at Groundbreaking Story in Upcoming Mahesh-Rajamouli Film

అడ్వెంచర్ జర్నీ..

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నారు. SSMB29 మూవీ కంప్లీట్ అడ్వంచర్ జోనర్ లో సాగుతుందని .. ఊహకు అందని ట్విస్టులు, మలుపులు ఈ సినిమాలో ఉంటాయన్నారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు.మహేష్ కెరీర్ లో ఇలాంటి సినిమా చేయడం ఇదే ఫస్ట్ అని అన్నారు. సినిమా కోసం చాలా కసరత్తు చేసి స్టోరీ రాసుకున్నట్లు విజయేంద్ర ప్రసాద్ వివరించారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Vijayendra Prasad Hints at Groundbreaking Story in Upcoming Mahesh-Rajamouli Film

ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ తెరకెక్కిస్తున్నారు.తుఫాన్‌ తర్వాత ప్రియాంకా చోప్రా తెలుగులో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటిస్తున్న మూవీ ఇదే కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+