మూడుముళ్ల బంధం.. ఒక్కటైన లవ్ బర్డ్స్..
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల10 నిమిషాలకు పెళ్లి జరగబోతుంది. దీంతో రాజస్థాన్ ఉదయపూర్ లోని ITC మెమెంటోస్ (ఎకాయా ఉదయపూర్) హోటల్ వద్ద సెలబ్రిటీల సందడి నెలకొంది. ఇక ఈ పెళ్లికి వచ్చిన అతిథుల కోసం తెలంగాణ స్టైల్ లో మటన్ బిర్యానీ, కర్ణాటక స్పెషల్ బిసిబేళా బాత్ ఉండనుంది. అంతేకాక కొడవ సంప్రదాయంలో ప్రత్యేకమైన పోర్క్ కర్రీ లతో విందు భోజనం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరికొద్ది గంటల్లో ఒక్కటి కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఈ రోజు ఉదయం 7:30 గంటలకు బరాత్ కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం 10:10 ముహూర్తంలో మొదటి వివాహం జరుగుతుంది. సాయంత్రం కొడవ సంప్రదాయంలో విజయ్- రష్మిక మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. ఇక ఈ వెడ్డింగ్ కోసం ఇప్పటికే సెలబ్రిటీలు, ఇరు కుటుంబాల బంధువులు ఉదయ్ పూర్ కు చేరుకున్నారు.
మరోవైపు విజయ్- రష్మిక హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హల్దీ వేడుకలో రష్మిక పసుపు రంగు చీరలో, పెళ్లి కళతో ఎంతో అందంగా మెరిసిపోతోంది. అలాగే సంగీత్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విజయ్- రష్మిక ఒకర్నొకరు చేయి పట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక మార్చి 3న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి 2018లో గీత గోవిందం చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఈ జంట తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పట్లో ఈ జంట షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరి బంధం బలపడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications