ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ కాంబోలో వచ్చిన మూవీ 'ఫంకీ'.. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పెద్దగా రాలేదని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి క్లోజింగ్ లో రూ. 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీతోపాటుగా, లవ్ స్టోరీని జత చేస్తూ ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ అనుదీప్. అయితే ఈ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేట్ కు కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాల్సి ఉంటుంది. దాంతో ఈ సినిమాను ఈ నెల 12 లేదా 13వ తేదీల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఫంకీ మూవీ తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుంది.
ఇక ఇటీవలి కాలంలో చాలా సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ.. ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. ఈ సినిమాకు కూడా అలాంటి మంచి రెస్పాన్స్ వస్తుందని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇక ఈ మూవీలో కయాదు లోహల్ హీరోయిన్ గా నటించింది. నరేష్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

ఇక విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రం 'కల్ట్' కు సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తనే స్వీయ దర్శకత్వం చేస్తుండటం విశేషం. ఈ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో 'ఈ నగరానికి ఏమైంది 2' చిత్రంలో విశ్వక్ సేన్ నటించబోతున్నాడు. మరోవైపు డైరెక్టర్ అనుదీప్.. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ కోసం ఓ కథ రాస్తున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications