మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మోగనున్న పెళ్లిబాజాలు

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మే 9వ తేదీన విశ్వంభర చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానరుపై రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికే రావాలనుకున్నప్పటికీ వీఎఫ్ ఎక్స్ లో నాణ్యత లేకపోవడం, రామ్ చరణ్ సినిమా ఉండటంతో మే 9కి వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి.. వీరిద్దరి దర్శకత్వంలో రెండు సినిమాలు చేయనున్నారు. తాజాగా చిరంజీవి ఇంట్లో త్వరలోనే పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. ఆయన మేనల్లుడు సాయిదుర్గాతేజ్ వివాహం జరగబోతోంది.

రెజీనాతో ప్రేమ వార్తలన్నీ పుకార్లే
సాయిదుర్గాతేజ్ గా పేరు మార్చుకున్న సాయిధరమ్ తేజ్ ఒక అమ్మాయిని ప్రేమించారు. అయితే పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో చిరంజీవి జోక్యం చేసుకున్నారు. ఇద్దరూ ఇష్టపడినప్పుడు వద్దనద్దొంటూ వారిద్దరికీ సర్దిచెప్పారు. చివరకు వారు అంగీకరించడంతో చిరంజీవి పెళ్లి పెద్దగా వివాహం జరగబోతోంది. వచ్చే వేసవిలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెజీనాను ప్రేమించాడని, త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లిచేసుకుంటారంటూ వార్తలు వచ్చాయికానీ ఈ వార్తతో అవన్నీ ఒట్టిదేనని తేలిపోయింది. అమ్మాయి వివరాలు మాత్రం బయటకు పొక్కలేదు. తిక్క సినిమాలో హీరోయిన్ గా నటించిన లారిస్సా బొనేసితో గతంలో ప్రేమలో పడ్డాడు.

Wedding soon at Megastar Chiranjeevi s house

ప్రేమించానని చెప్పినప్పటికీ..
పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు సాయిదుర్గాతేజ్ ప్రపోజ్ చేశాడుకానీ ఆ అమ్మాయి అప్పటికే వేరొకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. అయితే తాను త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్న అమ్మాయి వివరాలు మాత్రం చెప్పలేదు. బైక్ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటినుంచి కోలుకున్న తర్వాత ఇది తనకు పునర్జన్మ అని చెప్పాడు. ఆ సమయంలోనే విడుదలైన విరూపాక్ష సినిమా సూపర్ హిట్ సాధించింది. తర్వాత వచ్చిన బ్రో సినిమా మాత్రం బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. మంచి క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ తో కలిసి నటించినప్పటికీ ఆ సినిమాకు నష్టాలు తప్పలేదు. హనుమాన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలతో ఒక సినిమాను ఒప్పుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+