'యానిమల్' లో నటించిన నర్స్ ఎవరో తెలుసా?

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించారు. యాక్షన్ సన్నివేశాలతో.. బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

తాజాగా రూ .800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. రూ .1000 కోట్లకు చేరువలో ఉంది. అనిల్ కపూర్, దీప్తి డిమ్రి , బబ్లూ పృథ్వీరాజ్ , బాబి డియోల్, శక్తి కపూర్ వంటి భారీ తారాగణం నటించింది. వారందరికీ ఈ చిత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో నర్సు పాత్రలో నటించిన దీప్తి పాటిల్ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అభిమానులు గూగుల్ లో ఆమెకోసం తెగ వెతికేస్తున్నారు.

who is the animal movie nurse

దీప్తి పాటిల్ మొదటిగా టీవీ ఇండస్ట్రీ ద్వారా అడుగుపెట్టారు. 2018లో యే హే మోహబ్బతేన్ అనే ప్రోగ్రాం ద్వారా అడుగుపెట్టి.. ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. పెద్దగా వర్కౌట్ కాలేదు. యానిమల్ సినిమాలో నర్స్ పాత్ర కోసం ఆమెను ఆడిషన్ తీసుకొని ఎంపిక చేశారు. యానిమల్ తో దీప్తికి మంచిపేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. యానిమల్ తర్వాత భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు కూడా కుప్పలు తెప్పలుగా వస్తున్నట్లు తెలుస్తోంది. పౌరాణిక కథలు, క్రైమ్ ఎపిసోడ్స్ వంటి వాటిల్లో కూడా నటించింది. యానిమల్ తో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంచి పాత్రలు చేయాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+