తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా రూ.100 కోట్లు సాధించిన హీరో ఎవరో తెలుసా..?
తెలుగు ఇండస్ట్రీ సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. దాదాపు తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్నాయి. తెలుగు స్టార్ హీరోలు సినిమాలు చేస్తే రూ.1000 కోట్లు సాధిస్తున్నాయి. దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన జాబితాలో తొలి రెండు స్థానాల్లో తెలుగు సినిమాలే ఉండటం విశేషం. అయితే తెలుగులో అత్యధికంగా రూ.100 కోట్లు సాధించిన హీరో మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆ హీరో మరెవరో కాదు..సూపర్ స్టార్ మహేష్ బాబు.
తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు , భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. తెలుగులో అత్యధికంగా రూ.100 కోట్లు సాధించిన హీరోగా మహేష్ బాబు నిలిచారు.

శ్రీమంతుడు (2015)
'శ్రీమంతుడు'తో మహేష్ బాబు మొదటిసారిగా ₹100 కోట్ల మార్క్‌ను అందుకున్నారు. ఈ సినిమా కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, "గ్రామ దత్తత" అనే సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, మహేష్ నటనకు ప్రశంసలు అందుకుంది.
భరత్ అనే నేను (2018)
'శ్రీమంతుడు' తర్వాత కొరటాల శివతో మహేష్ బాబు కలిసి చేసిన మరో బ్లాక్ బస్టర్ 'భరత్ అనే నేను'. ఈ సినిమా కూడా ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. యువ ముఖ్యమంత్రిగా మహేష్ నటన, సామాజిక సందేశం ఉన్న కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
మహర్షి (2019)
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' సినిమా కూడా మహేష్ బాబు కెరీర్‌లో ఒక పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ₹100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా "రైతు"ల కష్టాలు, వారి సమస్యలపై దృష్టి సారించి ప్రేక్షకులను ఆలోచింపజేసింది.
సరిలేరు నీకెవ్వరు (2020)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం ₹100 కోట్ల క్లబ్‌లో సునాయాసంగా చేరి, మహేష్ స్టార్‌డమ్‌ను మరింత పెంచింది.
సర్కారు వారి పాట (2022)
బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే మోసాలపై వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమా కూడా సూపర్ స్టార్ కెరీర్‌లో మరో ₹100 కోట్ల సినిమాగా నిలిచింది. పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, మహేష్ బాబు స్టైలిష్ నటనకు ప్రశంసలు అందుకుంది.
గుంటూరు కారం(2024)
మాటల మాంత్రికుడు, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియోన్స్ గుంటూరు కారం సినిమాకు బ్రహ్మరథం పట్టారు. వీరికి ఫ్యాన్స్ కూడా తోడు కావడంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
వీటితో పాటు,దూకుడు, బిజినెస్ మ్యాన్ రూ. 100 కోట్ల గ్రాస్‌ను సాధించాయి. ఈ సినిమాలన్నీ మహేష్ బాబుకు కమర్షియల్‌గా విజయాన్ని అందించడమే కాకుండా, నటుడిగా ఆయన వైవిధ్యాన్ని కూడా చాటాయి. ఆయన కథల ఎంపిక, సామాజిక స్పృహ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications