నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌తో నటించిన ఏకైక హీరోయిన్
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి సుస్థిర స్థానం ఉంది. ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు అక్కినేని నాగ నాగేశ్వరరావు. ఎన్టీఆర్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించగా, ఏఎన్ఆర్ మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇక ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. రెండో తరం అగ్ర నటుల్లో ఒకడిగా నాగార్జున స్థానం దక్కించుకున్నారు.
అలాగే తండ్రి, కొడుకులతో నటించిన ఏకైక హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. శ్రీదేశి అటు నాగేశ్వరరావుతో పాటు, ఇటు నాగార్జునతో కూడా రొమాన్స్ చేశారు. ఇక నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే వీరిద్దరూ కూడా ఇప్పటి వరకు తమను తాము నిరూపించుకోలేకపోయారు. తాత, తండ్రి వారసత్వాన్ని తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తారని అక్కినేని అభిమానులంతా భావించారు.

అయితే వీరిద్దరు మాత్రం సరైన హిట్లను సాధించలేకపోతున్నారు. అయితే ఇటీవలే తండేల్ సినిమాతో చైతన్య సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరాడు చైతు.అఖిల్ లెనిన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇదిలా ఉంటే నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా తండ్రి , కొడుకులతో ముగ్గురితో నటించిన హీరోయిన్ ఒకరున్నారనే విషయం చాలామందికి తెలియదు. తండ్రి , కొడుకులతో నటించిన హీరోయిన్ మరెవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డె. నాగ చైతన్యతో ఒక లైలా కోసం, అఖిల్ అక్కినేనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటించింది. అయితే నాగార్జునతో పూజా హెగ్డే కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ ఓ యాడ్‌లో మాత్రం వీరిద్దరు కలిసి నటించారు.ఇలా తండ్రి , కొడుకులతో ముగ్గురితో కలిసి పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకుంది.












Click it and Unblock the Notifications