"రంగస్థలం" సినిమాలో గేదెతో సన్నివేశం ఉందని తప్పుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

"రంగస్థలం" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్‌లోని సహజ సిద్దమైన నటుడిని బయటకు తీసిన సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్‌గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు."రంగస్థలం" సినిమాలో రామలక్ష్మి పాత్రను సమంత పోషించారు. ఈ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. అయితే ఈ పాత్రకు తొలుత మరో హీరోయిన్‌ను తీసుకోవాలని భావించారట సుకుమార్. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. ఈ విషయాన్ని స్వయంగా సుకుమార్ ఓ వేదికపై వెల్లడించారు.

Take a Poll

"రంగస్థలం" సినిమా కోసం తొలుత అనుపమ పరమేశ్వరన్‌ను అడిషన్‌కు పిలిచారట సుకుమార్. అడిషన్ సమయంలో డైలాగులు చెప్పకుండా తన తల్లివైపు చూడటంతో, ఈ సినిమాకు ఆమె కరెక్ట్ కాదనుకున్న సుకుమార్ , అనుపమ పరమేశ్వరన్‌ను పక్కన పెట్టి సమంతను సెలెక్ట్ చేశారు. పైగా ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేయడంతో పాటు, గేదెలను కడుగుతు కొన్ని సన్నివేశాల్లో కనిపించాలని చెప్పడంతో భయపడిపోయిన,అనుపమ ఆ సినిమా నుంచి తప్పుకున్నారట. ఇలా అనుపమ పరమేశ్వరన్‌ నటించాల్సిన సినిమాలో సమంత నటించి బ్లాక్ బ్లాస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఒకవేళ "రంగస్థలం" సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ నటించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

who the heroine is who left the movie Rangasthalam

ఇక రామలక్ష్మి పాత్రలో సమంత అద్బుతంగా నటించారు.ఈ పాత్ర ద్వారా సమంత తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.ఈ సినిమాలో రామలక్ష్మి పాత్ర చిట్టిబాబు (రామ్ చరణ్) ప్రేమికురాలిగా చూపించబడింది.సినిమాలో రామలక్ష్మి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది.ఈ పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుంది. సమంత తన సహజ నటనతో రామలక్ష్మి పాత్రకు జీవం పోశారు.గ్రామీణ యువతిగా ఆమె హావభావాలు, యాస ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ పాత్ర సమంత కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+