శివాజీపై ప్రచారాన్ని ఎందుకు ఆపారు?.. అగ్రహీరోకు రాజకీయ నేత ప్రశ్న
దండోరా సినిమా వేడుకలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ అగ్ర కథానాయకుడు విపరీతంగా ప్రచారం చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి శివాజీకే మద్దతు వస్తుండటంతో చివరకు వారంతా ఆగిపోయారు. వాట్సాప్ గ్రూప్ కాల్స్ పెట్టి మరీ ఎలా దాడి చేయాలని అని చర్చించుకున్నవారంతా తర్వాత మౌనం వహించారు.
అంతటితో గొడవ సద్దుమణిగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే ఆ అగ్ర కథానాయకుడు తాను సొంతంగా ప్రచారం చేయడంకన్నా ఓ రాజకీయ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇలా చేశారన్న విషయం కూడా గతంలో మనం తెలుసుకున్నాం.

అసంతృప్తి వ్యక్తం చేసిన రాజకీయ నేత
హఠాత్తుగా శివాజీపై ప్రచారాన్ని ఆపేయడంపై ఆ పార్టీ అధినేత ఆ అగ్ర కథానాయకుడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజల నుంచి శివాజీకే మద్దతు రావడం, ప్రచారం చేయిస్తున్నామంటూ కొందరిచేత మాట్లాడించడంవంటివి కొనసాగిస్తే చివరకు తన పేరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఆపేశామని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రాజకీయ నేత అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎలాగైనా శివాజీని ఇరుకున పెట్టాలనుకుంటే కథ అడ్డం తిరిగిందని అతను భావించారంటున్నారు. గతంలో తమ పార్టీకి సంబంధించిన అన్ని రహస్యాలను బహిర్గతం చేయడం లాంటివి మనసులో పెట్టుకున్న సదరు నేత ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ తెలిసినా శివాజీ మౌనం
ఆ నేతకు ఈ గొడవను ఇంతటితో ఆపేయడం ఇష్టంలేదు. దీన్ని పెంచడంద్వారా తనకు రాజకీయ లబ్ధి కలగాలనేది అతని ఉద్దేశంగా ఉంది. గొడవ పెద్దైన తర్వాత ఓ రాజకీయ పార్టీకి, శివాజీకి లింకు పెట్టి దుష్ప్రచారం చేయించాలనుకుంటున్నారు. అయితే వివాదం దాదాపుగా సద్దుమణిగిపోవడం, అందుకు తాను నమ్మకున్న కథానాయకుడు కారణం కావడంతో ప్రస్తుతం అతనికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ నేత ఎవరు? ఎవరు చేయించారు? ఎవరు చేయిస్తున్నారు? ఆ హీరో ఎవరు? ఇలాంటి విషయాలన్నీ శివాజీకి తెలుసని, అయినా గొడవలు అనవసరం అన్న ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications