మళ్లీ అక్కడ కలవబోతున్న సమంత- నాగ చైతన్య..! ఒకే వేదికపై మాజీలు..!
తెలుగులో ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అయితే ఏమాయ చేశావే మూవీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. 2010 లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పాటలు ఇప్పటీక మార్మోగుతూనే ఉంటాయి. ఈ మూవీ రీ- రిలీజ్ కానుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేశావే మూవీ 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. ఈ సినిమా ద్వార ప్రముఖ నటి సమంత తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది. అయితే ఈ సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత యూత్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో సూపర్ హిట్ అయింది.
ఈ మూవీని ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీతో సమంత దశ దిశ మారిపోయింది. కెరీర్ పరంగా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది సామ్. ఇక తాజాగా జూలై 18న ఈ మూవీ రీ- రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఏమాయ చేశావే రీ- రిలీజ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మళ్లీ సమంత నాగ చైతన్యను ఒకే ఫ్రేమ్ లో చూస్తున్నామని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. మరి వారిద్దరూ ప్రమోషన్లలో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా ఈ సినిమా టైంలోనే సామ్- చై ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మ్యారేజ్ అయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆఫ్టర్ డివోర్స్ తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళను రెండో వివాహం చేసుకోగా సామ్ మాత్రం మరో మ్యారేజ్ చేసుకోలేదు. ఇక 2017లో అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల 2021లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.












Click it and Unblock the Notifications