మెగాస్టార్ అలా అన్నందుకు చాలా ఫీలయ్యా - సందీప్ కిషన్

యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. స్టార్ హీరో కుమారుడు ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేయడం.. అందులో తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న సందీప్ హీరోగా చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అలా అనడం చాలా హ్యాప్పీగా అనిపించింది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో సందీప్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

young heo Sandeep Kishan open on Megastar chiraneevi comments

సందీప్ ఏమన్నారంటే.. తన షూటింగ్ ఆర్ఎఫ్‌సీలో జరిగినప్పుడు చిరంజీవి విశ్వంభర షూటింగ్ పక్కన జరుగుతోంది. దీంతో ఆయన్ని కలవడానికి వెళ్లా.. అక్కడ ఆయన అన్న ఫస్ట్ మాట ఏంటంటే.. ఏయ్ విజయ్ అబ్బాయ్ సినిమా నువ్వు చేస్తున్నావా.. తెలుగు హీరో దగ్గరికి వచ్చాడేంటబ్బా.. సూపర్ గర్వపడుతున్నా అంటూ భుజం తట్టారని చెప్పారు. దీంతో మెగాస్టార్ చెప్పిన ఆ మాటలని ఎప్పటికీ మర్చిపోనంటూ సందీప్ అన్నారు.

ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. తెలుగు, తమిళ్‌లో విడుదల చేయనున్నారు. అలానే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. త్వరలోనే సినిమాకు సంబంధించి కాస్ట్ అండ్ క్రూ గురించి ప్రకటిస్తామని వెల్లడించారు. టైటిల్ కూడా అతి త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు సందీప్ కిషన్.

ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌కిషన్‌ 'మజాకా' సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్యమూవీస్ బ్యాన‌ర్‌ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రీతువర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మన్మధుడు ఫేమ్ అన్షు అంబానీ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+