నోరు జారిన జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 17 సంవత్సరాల వయసులోనే హీరో అయ్యారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానరుపై రామోజీరావు నిర్మించిన నిన్ను చూడాలని చిత్రంద్వారా పరిశ్రమలోకి అరంగ్రేటం చేశారు. 2001లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేశాడు. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత సుబ్బు చిత్రం చేసినప్పటికీ అది మ్యూజికల్ హిట్ గా నిలవడంతోపాటు ఎన్టీఆన్ తనలోని నృత్య ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశారు. 2002లో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రం ఎన్టీఆర్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. మాస్ హీరోగా మారిపోయాడు. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు
తిరిగి రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఎన్టీఆర్. ఆ సందర్భంలో యాంకర్ చిరంజీవి గురించి అభిప్రాయం చెప్పమని కోరగా... చిరంజీవి ఎవరు? నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మాతాత ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అనాలోచితంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అతనిపై వ్యతిరేకతను పెంచాయి. వెంటనే అక్కినేని నాగార్జున తారక్ కు ఫోన్ చేసి నువ్వు మాట్లాడేది ఏమిటి? పెద్దవారి గురించి అలాగేనా మాట్లాడాల్సింది? అది ఏమాత్రం సరికాదు.. పద్దతి మార్చుకొని హుందాగా మాట్లాడటం నేర్చుకో అంటూ హితవు పలికారు.

తారక్ తర్వాత పశ్చాత్తాపం చెందారు
చిరంజీవి లాంటి స్టార్ హీరో గురించి అలా మాట్లాడినందుకు ఆ తర్వాత తారక్ పశ్చాత్తాపం చెందాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవతున్న తరుణంలో రాజమౌళి యమదొంగ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ను చేశాడు. ప్రస్తుతం తారాక్ స్టేజీలపై ఎక్కడ మాట్లాడినా ఎంతో పరిపక్వతతో, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతాడు. ఎవరినీ నొప్పించడు. తన వాగ్దాటికి అందరూ ముగ్దులవుతారు. అలా మెచ్యూరిటీ సంపాదించిన తారక్ ప్రస్తుతం దేవర చిత్రంతో రూ.501 కోట్ల గ్రాస్ సాధించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తోపాటు వార్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఇది విడుదల కాబోతోంది. ఈలోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications