వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fact check : టెంపరేచర్ గన్స్‌తో ఆరోగ్యానికి హానికరమా...?

|
Google Oneindia TeluguNews

టెంపరేచర్ గన్స్ (కాంటాక్ట్‌లెస్ థర్మామీటర్స్‌‌)ను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని,చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని ఇటీవల వాట్సాప్‌లో కొన్ని మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత... వాటితో నిజంగానే ఆరోగ్యానికి హాని కలుగుతుందా...? అంటే కాదనే సమాధానమే వస్తోంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. టెంపరేచర్ గన్స్ నుంచి ఎలాంటి రేడియేషన్ విడుదల కాదని ఇటీవల మలేషియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది కేవలం శరీరంలోని వేడి ఇన్ఫ్రారెడ్ కిరణాల రూపంలో విడుదలవడాన్ని మాత్రమే గుర్తిస్తుందని... దాన్ని ఎలక్ట్రిసిటీగా మారుస్తుందని వెల్లడించింది. అయితే దీన్ని కేవలం మనుషుల టెంపరేచర్ టెస్టింగ్ కోసం మాత్రమే వాడాలని... పారిశ్రామిక అవసరాలకు కాదని స్పష్టం చేసింది.

Fact check: Are contactless thermometers harmful to your health

టెంపరేచర్ గన్‌ను ఉపయోగించేటప్పుడు నిర్దిష్ట దూరాన్ని పాటిస్తూ తగిన సమయం పాటు దాన్ని పాయింట్ చేయాలి. అప్పుడే సరైన ఫలితం వస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టెంపరేచర్ గన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు విస్తృతంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు,మాల్స్,హోటల్స్ ఇలా చాలా ప్రదేశాల్లో టెంపరేచర్ గన్స్‌ను ఉపయోగిస్తున్నారు.

తద్వారా ఎవరైనా జ్వరంతో ఉంటే వెంటనే అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. అంతే తప్ప సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు దీనివల్ల ఎలాంటి కెమికల్ రేడియేషన్ జరగదు.

Fact Check

వాదన

టెంపరేచర్ గన్స్‌తో ఆరోగ్యానికి హానికరం

వాస్తవం

టెంపరేచర్ గన్స్‌తో ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.

రేటింగ్

False
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
English summary
A forward on WhatsApp claims that temperature guns or contactless thermometers are bad for the skin and can harm your health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X