దారుణం: భర్త కళ్ళముందే భార్య గొంతుకోసి హతమార్చిన దుండగులు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం ప్రాంతంలో శనివారం రాత్రి ఒక మహిళ దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త కళ్ల ముందే దుండగులు ఆమెను లాక్కెళ్లి గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటనలో భర్త కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

భర్త కళ్ళముందే భార్యపై దుండగుల దాడి

బీహార్ రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్, మీనాదేవి దంపతులు ఐడీఏ బొల్లారం వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు. శనివారం రాత్రి స్థానికంగా జరిగిన సంతకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా గండిగూడెం క్రీడా ప్రాంగణం సమీపంలో వారి ద్విచక్రవాహనం ఆగిపోయింది. ఈ సమయంలో చెట్ల పొదల మధ్య నుంచి బయటకు వచ్చిన దుండగులు భర్తపై దాడి చేసి, భార్యను బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం మీనాదేవి గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు.

Brutal murder in Sangareddy A woman murdered by throat slit in front of her husband attack on husband too

భార్యను కాపాడటానికి ప్రయత్నించిన భర్తపైనా దాడి

భార్యను కాపాడటానికి ప్రయత్నించిన అనిల్ కుమార్‌పై కూడా కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అనిల్ కుమార్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐడీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళ శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.

హత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు

దుండగులు ఎవరు, హత్యకు కారణం ఏమిటి అనే విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు, స్థానికుల నుంచి సమాచారం సేకరించి నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ముఖ్యంగా మహిళలు రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్లడం సురక్షితం కాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ న్యూస్.. సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు మెట్రో రేంజ్ సౌకర్యాలు!
సూపర్ న్యూస్.. సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు మెట్రో రేంజ్ సౌకర్యాలు!

వ్యక్తిగత కక్షలా లేదా దోపిడీ ఉద్దేశమా?

ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని స్థానిక ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ, హత్య వెనుక ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేదా దోపిడీ ఉద్దేశం ఉందా అనే అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+