Fact Check : సీరం, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల తిరస్కరణ- ఫేక్ న్యూస్ అని కేంద్రం క్లారిటీ
భారత్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం దేశమంతా ఎదురుచూస్తున్న వేళ దీని దేశీయ తయారీ సంస్ధలు భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాను కోరాయి. వీటిని కేంద్రం పరిశీలిస్తున్న తరుణంలోనే అనుమతి నిరాకరించిందంటూ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇవాళ పలు మీడియా సంస్ధల్లో ప్రసారం, ప్రచురణ అయిన వార్తలపై కేంద్రం స్పందించి క్లారిటీ ఇచ్చింది.
Claim: NDTV has reported that the emergency use of the vaccine by Serum Institute and Bharat Biotech has been rejected#PIBFactCheck: This claim is #Fake. pic.twitter.com/zmUgqF2Nkt
— PIB Fact Check (@PIBFactCheck) December 9, 2020
జాతీయ వార్తా ఛానల్ ఎన్డీటీవీలో ఈ వ్యాక్సిన్ల సమర్ధతపై సంతృప్తి చెందనందున కేంద్రం వీటికి అనుమతి నిరాకరించినట్లు తెలిపింది. దీన్ని కోట్ చేస్తూ కేంద్ర ఆరోగ్య సంక్షేమశాఖ ఫేక్ న్యూస్ అంటూ ఇచ్చిన క్లారిటీని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసింది. దీంతో కేంద్రం వీటిని తిరస్కరించినట్లు వెలువడిన వార్తలకు చెక్ పెట్టినట్లయింది. మరోవైపు ఈ వ్యాక్సిన్ల ట్రయల్స్ భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వెలువడిన వార్తల వల్ల వ్యాక్సిన్లపై అనుమానాలు నెలకొంటాయనే ఉద్ధేశంతో కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇప్పటికే దేశంలోని 25 చోట్ల తమ కోవాక్సిన్ వ్యాక్సిన్‌ను మూడు దశల్లో పరీక్షించింది. వీటిలో మంచి ఫలితాలే వచ్చాయి. అలాగే పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా ఆక్స్‌పర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంస్దలతో కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను సైతం బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో పరీక్షిస్తోంది. ఈ వ్యాక్సిన్‌కు సంబందించి కూడా సంతృప్తి కర ఫలితాలు వెలువడుతున్నాయని ఆయా సంస్ధలు ప్రకటించాయి.

Fact Check
వాదన
భారత్‌లో అత్యవసర సమయాల్లో తమ వ్యాక్సిన్ వాడేందుకు సీరం, భారత్ బయోటెక్ సంస్ధలు చేసిన అభ్యర్ధన తిరస్కరించిన కేంద్రం
వాస్తవం
సీరం, భారత్ బయోటెక్ సంస్ధల అభ్యర్ధనను తాము తిరస్కరించలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
రేటింగ్
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications