Fact Check : ఆఫ్ఘన్‌లో భారత దౌత్య కార్యాలయం తాలిబన్ల నియంత్రణలోకి... ఇందులో నిజమెంత?

ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలోని భారత దౌత్య అధికారులను వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే. కాందహార్‌లోని దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసిన భారత్.. దాదాపు 50 మంది అధికారులను వెనక్కి రప్పించింది. ఈ నేపథ్యంలో కాందహార్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా కొన్ని వీడియోలు వెలుగుచూశాయి. అయితే ఇందులో నిజమెంత... భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఏమంటోంది....

ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయాన్ని వన్‌ఇండియా సంప్రదించగా... ఆ వీడియోలలో నిజం లేదని స్పష్టం చేసింది. దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపింది. దీంతో భారత దౌత్య కార్యాలయాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారన్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది.

fact check is it true taliban taken over indian consulate in afghanistan

ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా,నాటో దళాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు మరింత రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పట్టణాలు,నగరాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. కాబూల్,కాందహార్ నగరాలకు అతి సమీపంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే దౌత్య కార్యాలయాన్ని భారత్ తాత్కాలికంగా మూసివేసింది. సుమారు 50 మంది భారత దౌత్య అధికారులను వెనక్కి రప్పించింది.

మరోవైపు దౌత్య అధికారులను వెనక్కి రప్పించడానికి దౌత్య కార్యాలయం ఇప్పటికీ తెరిచే ఉందని కాందహార్ గవర్నర్ అధికార ప్రతినిధి అహ్మది పేర్కొనడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి బాగ్చి మాట్లాడుతూ.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ప్రస్తుతం ఆఫ్ఘన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు.

Recommended Video

    Why Lord Shiva Has Blue Throat? | Oneindia Telugu

    కాందహార్‌లో భారత దౌత్య కార్యాలయం తాత్కాలికంగా మూతపడిందని... అయితే వీసా,ఇతరత్రా పనులు కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయంలో యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన స్థానిక సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

    Fact Check

    వాదన

    కాందహార్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

    వాస్తవం

    కాందహార్‌లో భారత దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తాలిబన్లు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకోలేదు. కాబూల్‌లోని దౌత్య కార్యాలయం యథావిధిగా నడుస్తోంది.

    రేటింగ్

    Misleading
    ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+